Man Rides With Guitar | వెనుక గిటార్‌తో స్కూటీ నడిపిన వ్యక్తి.. హెల్మెట్ ధరించలేదని జరిమానా
Man Rides With Guitar | ఒక వ్యక్తి వెనుక గిటార్ తగిలించుకుని స్కూటీ డ్రైవ్ చేశాడు. అయితే ఆ గిటార్‌ను వెనుక కూర్చొన్న వ్యక్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ కెమెరా పొరపాటుపడింది. ఈ నేపథ్యంలో హెల్మెట్ ధరించలేదని ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.
బెంగళూరు: ఒక వ్యక్తి వెనుక గిటార్ తగిలించుకుని స్కూటీ డ్రైవ్ చేశాడు. అయితే ఆ గిటార్‌ను వెనుక కూర్చొన్న వ్యక్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ కెమెరా పొరపాటుపడింది. ఈ నేపథ్యంలో హెల్మెట్ ధరించలేదని ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. (Man Rides With Guitar) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 15న సౌవిక్ దత్తా అనే వ్యక్తి తన భార్యకు చెందిన స్కూటీని డ్రైవ్ చేశారు. ఒక గిటార్‌ను వెనుక తగిలించుకుని ఒంటరిగా ఆయన ప్రయాణించారు.
కాగా, సౌవిక్ దత్తా వెనుక తగిలించుకున్న గిటార్‌ను మరో వ్యక్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ కెమెరా పొరపాటుపడింది. దీంతో స్కూటీ వెనుక కూర్చొన్న వ్యక్తి హెల్మెట్ ధరించనందుకు రూ.500 జరిమానా విధించారు. ఈ ట్రాఫిక్ చలానా చూసి సౌవిక్ దత్తా షాక్ అయ్యారు. ఏఐ ట్రాఫిక్ కెమెరా తీసిన ఫొటో, జారీ చేసిన జరిమానాను ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. ఏఐ ఆధారిత ట్రాఫిక్ ఉల్లంఘనల గుర్తింపు అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ఈ చలాన్‌ను రద్దు చేయాలని ట్రాఫిక్ పోలీస్ విభాగాన్ని ఆయన కోరారు.
మరోవైపు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఈ ఉల్లంఘన సరిదిద్దుకోవడానికి సంబంధిత ఈమెయిల్ లేదా ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయనకు సూచించారు.
అయితే వైరల్ అయిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందించారు. ఒకసారి జారీ చేసిన చలాన్‌ను రద్దు చేయరని, దీని కోసం చాలాసార్లు తిరగాల్సి వస్తుందని, మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుందని ఒకరు పేర్కొన్నారు. ట్రాఫిక్ కెమెరాలు చేసే సాధారణ పొరపాటు వల్ల ఒక మార్గంలో తాను వెళ్లకపోయినప్పటికీ చలానా అందినట్లు మరొకరు ఆరోపించారు. ‘వెనుక కూర్చున్న వ్యక్తి (గిటార్) హెల్మెట్ ధరించినట్లు కనిపించడం లేదు’ అని ఒకరు చమత్కరించారు.
I was riding my wife’s two-wheeler alone with my guitar slung on my back in Bangalore. @blrcitytraffic my wife received a traffic challan (notice no. 86202541) for “pillion riding without helmet”. So much for AI based traffic violation detection! Pls revoke the challan #AISlop pic.twitter.com/fYCn9OoUNQ
— Souvik Dutta (@souvikonline) September 26, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bengaluru
- Challan
- guitar
- Helmetless
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

