RamNagar Fish Market | రామ్‌నగర్ చేపల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 40 కిలోల కుళ్లిన చేపలు పట్టివేత!
హైదరాబాద్: నగరంలోని రామ్‌నగర్ చేపల మార్కెట్‌పై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ (TG SAFE) అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.
హైదరాబాద్: నగరంలోని రామ్‌నగర్ చేపల మార్కెట్‌పై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ (TG SAFE) అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వినియోగానికి పనికిరాని, కుళ్లిపోయిన సుమారు 40 కిలోల చేపలను అధికారులు గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. మార్కెట్లోని పలు దుకాణాల్లో కనీస పరిశుభ్రత పాటించకుండా, అపరిశుభ్ర వాతావరణంలో చేపలను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన రెండు దుకాణాలకు నోటీసులు జారీ చేసి, వాటిని తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. అలాగే, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న మరికొందరు వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు.
చేపలు తాజాగా కనిపించేందుకు ‘ఫార్మాలిన్’ వంటి హానికర రసాయనాలు కలుపుతున్నారనే అనుమానంతో అధికారులు నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. నివేదికలో కల్తీ తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రామ్‌నగర్‌తో పాటు బేగంపేట, బేగంబజార్, ముషీరాబాద్ మార్కెట్లపైనా నిఘా పెంచామని, ప్రజలు కూడా చేపలు కొనేటప్పుడు తాజాదనాన్ని గమనించాలని అధికారులు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
RamNagar Fish Market | రామ్‌నగర్ చేపల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 40 కిలోల కుళ్లిన చేపలు పట్టివేత!
Bhogi Review | ‘భోగి’ సినిమా రివ్యూ.. శర్వానంద్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
SONNENTAL | ‘డార్క్’ మేకర్స్ నుంచి మరో క్రేజీ థ్రిల్లర్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘సోనెంటల్’ ట్రైలర్!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌కు FWICE గట్టి వార్నింగ్.. భారత్‌లో ఆ పాకిస్థానీ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే షూటింగ్స్ బంద్!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

