SONNENTAL | ‘డార్క్’ మేకర్స్ నుంచి మరో క్రేజీ థ్రిల్లర్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘సోనెంటల్’ ట్రైలర్!
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్మన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘డార్క్’ (DARK) సృష్టికర్తలు బారన్ బో ఓడర్ (Baran bo Odar), జాంట్జే ఫ్రైస్ (Jantje Friese) మరోసారి ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేందుకు సిద్ధమయ్యారు.
SONNENTAL | ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్మన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘డార్క్’ (DARK) సృష్టికర్తలు బారన్ బో ఓడర్ (Baran bo Odar), జాంట్జే ఫ్రైస్ (Jantje Friese) మరోసారి ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేందుకు సిద్ధమయ్యారు. వీరి నిర్మాణంలో రాబోతున్న సరికొత్త జర్మన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘సోనెంటల్’ (SONNENTAL). ఈ సిరీస్‌కి సంబంధించిన తొలి టీజర్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ‘డార్క్’ సిరీస్‌లో మార్తా నీల్సన్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి లిసా వికారి (Lisa Vicari) ఈ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం.
ఈ సిరీస్ కథాంశం చాలా భయానకంగా, ఆసక్తికరంగా ఉండబోతోందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇందులో లిసా వికారి ‘అంజా వోగ్లర్’ అనే క్రిమినల్ ప్రొఫైలర్గా కనిపించనున్నారు. తన సొంత ఊరైన సోనెంటల్లో జరిగిన ఓ దారుణ హత్య కేసును దర్యాప్తు చేసేందుకు ఆమె తిరిగి వస్తుంది. అయితే ఆ హత్యల వెనుక ఒక భయంకరమైన ప్యాటర్న్ ఉందని ఆమె గుర్తిస్తుంది. 1845 నాటి 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ జర్మన్ బాలల పుస్తకం ‘స్ట్రువెల్పీటర్’ (Struwwelpeter) లోని భయానక కథల ఆధారంగా హంతకుడు ఈ వరుస హత్యలకు పాల్పడుతున్నాడని దర్యాప్తులో తేలుతుంది. పిల్లలను భయపెట్టేందుకు రాసిన ఆ పుస్తకంలోని కథలను హంతకుడు నిజ జీవితంలో ఎలా అమలు చేశాడు? వాటి వెనుక దాగి ఉన్న రహస్యాన్ని క్రిమినల్ ప్రొఫైలర్ ఎలా ఛేదించింది? అన్నదే ఈ సిరీస్ ప్రధాన కథాంశం. ఆరు ఎపిసోడ్లతో కూడిన ఈ ఉత్కంఠభరిత సిరీస్ 2027 మార్చిలో HBO Max లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SONNENTAL | ‘డార్క్’ మేకర్స్ నుంచి మరో క్రేజీ థ్రిల్లర్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘సోనెంటల్’ ట్రైలర్!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌కు FWICE గట్టి వార్నింగ్.. భారత్‌లో ఆ పాకిస్థానీ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే షూటింగ్స్ బంద్!
Hyderabad | కొండాపూర్‌లో అక్రమ సెల్లార్ నిర్మాణం.. కూలిన పక్క హోటల్ గోడ, పలువురికి గాయాలు!
Road Accident | ఇచ్చోడ జాతీయ రహదారిపై కారు బోల్తా.. నలుగురికి గాయాలు
గద్వాల ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన.. DTOతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

