Netflix | నెట్‌ఫ్లిక్స్‌కు FWICE గట్టి వార్నింగ్.. భారత్‌లో ఆ పాకిస్థానీ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే షూటింగ్స్ బంద్!
Netflix | పాకిస్థాన్‌కు చెందిన తొలి నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్‌గా ప్రచారం పొందుతున్న ‘జో బచాయ్ హై సంగ్ సమైట్ లో’ (Jo Bachay Hain Sang Samait Lo) ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
Netflix | పాకిస్థాన్‌కు చెందిన తొలి నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్‌గా ప్రచారం పొందుతున్న ‘జో బచాయ్ హై సంగ్ సమైట్ లో’ (Jo Bachay Hain Sang Samait Lo) ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 4న స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్న ఈ వెబ్ సిరీస్ చుట్టూ భారత్‌లో వివాదం ముదురుతోంది. ఈ సిరీస్‌ను భారతదేశంలో విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రముఖ సినీ కార్మిక సంఘం ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) నెట్‌ఫ్లిక్స్‌ను హెచ్చరించింది. అవసరమైతే భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల షూటింగ్స్‌ను నిలిపివేస్తామని స్పష్టం చేసింది.
‘జో బచాయ్ హై సంగ్ సమైట్ లో’ సిరీస్‌లో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటీనటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్, సనమ్ సయీద్, హనియా ఆమీర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైన వెంటనే భారత్‌లోని సినీ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పాకిస్థానీ కళాకారులకు సంబంధించిన కంటెంట్‌ను భారతదేశంలో ప్రోత్సహించకూడదని పలువురు సినీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదంపై FWICE అధ్యక్షుడు బి.ఎన్. తివారీ తీవ్రంగా స్పందించారు. భారతదేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, పాకిస్థానీ కళాకారులకు సంబంధించిన కంటెంట్‌ను భారత్‌లో ప్రదర్శించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఒకవేళ నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను భారతదేశంలో విడుదల చేస్తే, తమ సభ్యులు ఆ సంస్థకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్టుల కోసం ఎక్కడ షూటింగ్స్ జరుగుతున్నా అక్కడి నుంచి తమ కార్మికులను ఉపసంహరించుకుంటామని, అవసరమైతే షూటింగ్స్‌ను పూర్తిగా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌తో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని, అయితే దేశ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని ఆయన పేర్కొన్నారు.మరోవైపు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) కూడా ఈ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సిరీస్‌ను భారతదేశంలో నిషేధించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు సమాచారం. పాకిస్థానీ కంటెంట్‌పై గతంలో తీసుకున్న నిర్ణయాలు, ఉగ్రవాద దాడుల నేపథ్యంలో భారత్‌లో నెలకొన్న పరిస్థితులను లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 4లోపు ఈ సిరీస్‌ను భారతదేశంలో అందుబాటులో లేకుండా చేయకపోతే నిరసనలు చేపడతామని, బహిష్కరణకు పిలుపునిస్తామని AICWA హెచ్చరించింది.
ఈ వివాదంపై పాకిస్థాన్ ప్రణాళికా శాఖ మంత్రి అహ్సన్ ఇక్బాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కళలు, సంస్కృతిని రాజకీయాలకు ఉపయోగించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఈ అంశం ఇరు దేశాల మధ్య మరోసారి చర్చకు దారితీసింది. ఇక నెట్‌ఫ్లిక్స్ మాత్రం ఈ సిరీస్‌ను భారత్‌లో స్ట్రీమింగ్ చేస్తుందా లేదా అనే విషయంపై ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. ఒకవైపు భారతీయ సినీ కార్మిక సంఘాల హెచ్చరికలు, మరోవైపు పాకిస్థాన్ నుంచి వస్తున్న స్పందనలతో ఈ వివాదం మరింత ముదురుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netflix | నెట్‌ఫ్లిక్స్‌కు FWICE గట్టి వార్నింగ్.. భారత్‌లో ఆ పాకిస్థానీ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే షూటింగ్స్ బంద్!
Hyderabad | కొండాపూర్‌లో అక్రమ సెల్లార్ నిర్మాణం.. కూలిన పక్క హోటల్ గోడ, పలువురికి గాయాలు!
Road Accident | ఇచ్చోడ జాతీయ రహదారిపై కారు బోల్తా.. నలుగురికి గాయాలు
గద్వాల ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన.. DTOతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయొద్దు: నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

