Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయొద్దు: నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయవద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో పచ్చని చెట్లను తొలగించడం దారుణమని అన్నారు.
Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయవద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో పచ్చని చెట్లను తొలగించడం దారుణమని అన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించకుండా వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలో నూతన ఎమ్మార్వో కార్యాలయ నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో శ్రీరంగాపురం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, ఎంతో పట్టుదలతో వాటిని పెంచి పల్లె ప్రకృతి వనాన్ని అభివృద్ధి చేశారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం నూతన ఎమ్మార్వో కార్యాలయం నిర్మాణం కోసం ఆ వనాన్ని నాశనం చేయాలనే ఆలోచన చేయడం సరికాదన్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు, అవకాశాలు ఉన్నప్పటికీ ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయాలని భావించడం దారుణమని విమర్శించారు.
చెట్లను నరికివేయడం కాకుండా, మరిన్ని చెట్లను పెంచి పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని నాశనం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం చేపట్టే క్రమంలో పల్లె ప్రకృతి వనానికి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయొద్దు: నిరంజన్ రెడ్డి
KTR | ‘ఆకాశంలో ఒక తార’పై కేటీఆర్ ప్రశంసల వర్షం.. చాలా కాలం తర్వాత ఇంత మంచి సినిమా చూశానంటూ కామెంట్స్!
Layoffs | భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైన మరో టెక్ దిగ్గజం.. SAPలో 10 వేల ఉద్యోగాలకు కోత?
Akhil | భార్యతో కలిసి జపాన్ చెక్కేసిన అఖిల్ అక్కినేని.. రెండు వారాల ట్రిప్ వెనుక అసలు కారణం ఇదే!
IND vs NZ | తొలి రోజు ఐదు వికెట్లు తీసిన భారత్.. కివీస్ స్కోర్ ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

