Layoffs | భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైన మరో టెక్ దిగ్గజం.. SAPలో 10 వేల ఉద్యోగాలకు కోత?
Layoffs | ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో దిగ్గజ కంపెనీ ఉద్యోగుల కోతకు సిద్దమైంది. జర్మనీకి చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ SAP సుమారు 10 వేల ఉద్యోగాలను తగ్గించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది.
Layoffs | ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో దిగ్గజ కంపెనీ ఉద్యోగుల కోతకు సిద్దమైంది. జర్మనీకి చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ SAP సుమారు 10 వేల ఉద్యోగాలను తగ్గించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పెట్టుబడులు పెంచుతూ, వ్యాపార కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఉద్యోగాల తొలగింపు అనేది ఒకేసారి కాకుండా వివిధ మార్గాల్లో చేపట్టనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే నేరుగా ఉద్యోగాలను తొలగించడం కంటే కూడా సహజంగా ఖాళీ అయ్యే స్థానాలను భర్తీ చేయకపోవడం(Attrition), స్వచ్ఛందంగా ఉద్యోగాల నుంచి వైదొలిగే అవకాశాలు కల్పించడం వంటి విధానాల ద్వారా ఈ ప్రక్రియ చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే, ఏ విభాగాల్లో ఉద్యోగాల కోత ఉండనుంది? ఏయే బృందాలు ప్రభావితమవుతాయి? అనే వివరాలను SAP ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఉద్యోగులు కలిగిన SAP, వ్యాపార సంస్థలకు అవసరమైన ఎంటర్ప్రైజ్ సాఫ్ట్‌వేర్‌ను అందించే అతిపెద్ద సంస్థల్లో ఒకటి. ఆర్థిక నిర్వహణ, సరఫరా వ్యవస్థలు, మానవ వనరులు, ఇతర కీలక వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన సాఫ్ట్వేర్ సేవలను ఈ సంస్థ అందిస్తోంది. ప్రస్తుతం టెక్నాలజీ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలు, ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్‌పై భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో SAP కూడా తన సాఫ్ట్వేర్ ఉత్పత్తుల్లో AI ఫీచర్లను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తోంది. క్లౌడ్ సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు, AI ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, కొన్ని విభాగాల్లో ఖర్చులను తగ్గించడం, భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉన్న AI సంబంధిత రంగాలకు వనరులను మళ్లించడం వంటి లక్ష్యాలతో ఉద్యోగాల కోత చేపట్టనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Layoffs | భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైన మరో టెక్ దిగ్గజం.. SAPలో 10 వేల ఉద్యోగాలకు కోత?
Akhil | భార్యతో కలిసి జపాన్ చెక్కేసిన అఖిల్ అక్కినేని.. రెండు వారాల ట్రిప్ వెనుక అసలు కారణం ఇదే!
IND vs NZ | తొలి రోజు ఐదు వికెట్లు తీసిన భారత్.. కివీస్ స్కోర్ ఎంతంటే..!
Alias Rukmini Trailer | పగలు కోర్టులో స్టెనోగ్రాఫర్, రాత్రి రొమాంటిక్ రచయిత.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్!
Bomb Cyclone effect | బాంబ్ సైక్లోన్‌తో అమెరికా ఉక్కిరిబిక్కిరి.. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు..!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

