KTR | ‘ఆకాశంలో ఒక తార’పై కేటీఆర్ ప్రశంసల వర్షం.. చాలా కాలం తర్వాత ఇంత మంచి సినిమా చూశానంటూ కామెంట్స్!
KTR | సినిమా బాగుంటే సామాన్య ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసలు కురిపించడం సహజం. అయితే కొన్ని సినిమాలు మాత్రం చూసిన తర్వాత మనసుకు హత్తుకోవడమే కాకుండా, జీవితంలో ఏదైనా సాధించాలనే స్ఫూర్తిని కూడా కలిగిస్తాయి. అలాంటి అనుభూతిని అందించిన చిత్రమే ‘ఆకాశంలో ఒక తార’.
KTR | సినిమా బాగుంటే సామాన్య ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసలు కురిపించడం సహజం. అయితే కొన్ని సినిమాలు మాత్రం చూసిన తర్వాత మనసుకు హత్తుకోవడమే కాకుండా, జీవితంలో ఏదైనా సాధించాలనే స్ఫూర్తిని కూడా కలిగిస్తాయి. అలాంటి అనుభూతిని అందించిన చిత్రమే ‘ఆకాశంలో ఒక తార’. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. చాలా కాలం తర్వాత ఇంత అందమైన సినిమాను చూశానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘ఆకాశంలో ఒక తార’ సినిమా తనకు ఎంతో నచ్చిందని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అసాధ్యమైన కలలు కనడమే కాకుండా, వాటిని నిజం చేసుకోవడానికి చేసే స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని దర్శకుడు ఎంతో అందంగా తెరపై ఆవిష్కరించారని ప్రశంసించారు. చాలా సరళమైన కథతో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించారని కొనియాడారు. చాలా కాలం తర్వాత ఇంతటి అందమైన సినిమాను చూశానని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన దుల్కర్ సల్మాన్ నటనపై కేటీఆర్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. అలాగే కీలక పాత్రలో నటించిన శ్రుతిహాసన్ కూడా అద్భుతంగా నటించారని కొనియాడారు. వీరిద్దరి నటన సినిమాకు మరింత బలాన్ని చేకూర్చిందని అభిప్రాయపడ్డారు.
ఇక ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సాత్విక వీరవల్లి నటనను కూడా కేటీఆర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. తొలి చిత్రంతోనే తన ప్రతిభను నిరూపించుకున్నారని, ఆమె నటన ఎంతో ఆకట్టుకుందని అభినందించారు. కొత్తగా పరిచయమైనప్పటికీ మంచి నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారని పేర్కొన్నారు. ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాధినేని పనితీరును కూడా కేటీఆర్ అభినందించారు. ఒక మంచి కథను ఎంచుకుని, దాన్ని ప్రేక్షకులకు హృదయానికి హత్తుకునేలా అందించడంలో ఆయన విజయవంతమయ్యారని ప్రశంసించారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు చక్కటి సందేశంతో పాటు మంచి సినిమా అనుభూతిని అందించిన చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయొద్దు: నిరంజన్ రెడ్డి
KTR | ‘ఆకాశంలో ఒక తార’పై కేటీఆర్ ప్రశంసల వర్షం.. చాలా కాలం తర్వాత ఇంత మంచి సినిమా చూశానంటూ కామెంట్స్!
Layoffs | భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైన మరో టెక్ దిగ్గజం.. SAPలో 10 వేల ఉద్యోగాలకు కోత?
Akhil | భార్యతో కలిసి జపాన్ చెక్కేసిన అఖిల్ అక్కినేని.. రెండు వారాల ట్రిప్ వెనుక అసలు కారణం ఇదే!
IND vs NZ | తొలి రోజు ఐదు వికెట్లు తీసిన భారత్.. కివీస్ స్కోర్ ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

