Kerala student free ticket | ఉచిత బస్ టికెట్ అడిగిన విద్యార్థిని.. జెండర్ ప్రశ్నించిన కండక్టర్పై కేసు నమోదు
Kerala student free ticket | ఒక విద్యార్థిని ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది. ఉచిత టికెట్ ఇవ్వాలని అడిగింది. అయితే ఆ యువతి డ్రెస్ వల్ల అబ్బాయిగా కండక్టర్ పొరపాటుపడ్డాడు. ఈ నేపథ్యంలో జెండర్ ఏమిటని ప్రశ్నించాడు. కండక్టర్పై ఆ యువతి ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేశారు.
తిరువనంతపురం: ఒక విద్యార్థిని ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది. ఉచిత టికెట్ ఇవ్వాలని అడిగింది. అయితే ఆ యువతి డ్రెస్ వల్ల అబ్బాయిగా కండక్టర్ పొరపాటుపడ్డాడు. ఈ నేపథ్యంలో జెండర్ ఏమిటని ప్రశ్నించాడు. కండక్టర్పై ఆ యువతి ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేశారు. (Kerala student free ticket) కేరళలోని కొచ్చి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఇంటర్ విద్యార్థిని తన స్నేహితులతో కలిసి నార్త్ పరావూర్ నుంచి కొచ్చికి వెళ్లే ఆర్డీసీ బస్సులో ప్రయాణించింది. ఆ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్నారు.
కాగా, ఆలయ సందర్శన అనంతరం ఆ అమ్మాయి తలనీలాలు సమర్పించడంతో పాటు టీ షర్ట్, జీన్స్ ధరించించి. దీంతో బస్సు కండక్టర్ ఆమెను అబ్బాయిగా పొరబడి రూ.15 టికెట్ ఇచ్చాడు. అయితే ఆ విద్యార్థిని తనకు జీరో టికెట్ ఇవ్వాలని అడిగింది. ఈ నేపథ్యంలో ఆమె జెండర్ ఏమిటని కండక్టర్ అడిగాడు. ఆమె అమ్మాయి అని తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించాడు. చిన్న వాగ్వాదం తర్వాత జీరో టికెట్ ఇచ్చాడు.
మరోవైపు ఆర్టీసీ బస్సు కండక్టర్ తన జెండర్ అడిగి అవమానించినట్లు ఆ యువతి ఆరోపించింది. ఆర్టీసీ అధికారులతో పాటు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ విజిలెన్స్ విభాగం ప్రాథమిక విచారణ జరిపింది. ఆ తర్వాత కండక్టర్ మహేష్ను సస్పెండ్ చేశారు. పోలీసులు కూడా ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే ఆ విద్యార్థిని తాను అవమానించినట్లుగా వచ్చిన ఆరోపణలను కండక్టర్ మహేష్ ఖండించారు. కేవలం అపార్థం వల్ల ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. ఆ విద్యార్థినిని అబ్బాయిగా భావించడం వల్లే మొదట రూ.15 టికెట్ ఇచ్చానని చెప్పారు. తాను అమ్మాయి అని ఆమె స్పష్టం చేసిన తర్వాత, దానికి బదులుగా జీరో టికెట్ ఇచ్చినట్లు వివరించారు.
అలాగే టీ షర్ట్, జీన్స్ ధరించడంతోపాటు గుండుతో ఉన్న ఆ విద్యార్థిని పక్కనే కూర్చున్న మహిళా ప్రయాణికురాలు కూడా మొదట్లో అబ్బాయిగా పొరబడ్డారని కండక్టర్ మహేష్ తెలిపారు. ఆ అమ్మాయి పట్ల తాను ఎలాంటి అసభ్యకరమైన లేదా అవమానకరమైన భాష ఉపయోగించలేదని చెప్పారు. కొందరు ప్రయాణికులు కూడా పోలీసులకు వాంగ్మూలాలు ఇచ్చారని వివరించారు. ఈ కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోగలననే నమ్మకం తనకు ఉన్నదని ఆ కండక్టర్ మీడియాతో అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

