వేలం..మళ్లీ అట్టర్‌ఫ్లాప్!
- కోకాపేట్, మూసాపేట్ భూములకూ కరువైన బిడ్డర్లు
- రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ముఖం చాటేస్తున్న పెట్టుబడిదారులు
- ట్రక్ పార్క్ భూముల పరిరక్షణకు ఫలించిన బీఆర్ఎస్ పోరాటం
హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ భూముల ఈ-వేలం ప్రక్రియకు వరుసగా రెండో రోజు కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కా్రంగెస్ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలానికి రియల్టర్లు, పెట్టుబడిదారులు ముఖం చాటేస్తున్నారు. ప్రభుత్వ పనితీరుతో రియల్ రంగం కుదేలయ్యిందనడానికి తాజా పరిస్థితులు అద్దం పడుతున్నాయి. బంజారాహిల్స్ హుడా హైట్స్ ప్లాట్ల వేలం విఫలమైన తరహాలోనే, శుక్రవారం నిర్వహించిన కోకాపేట్ నియోపోలిస్, మూసాపేట్ ట్రక్ పార్ భూముల వేలం పాట కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. రూ.1,200 కోట్ల ఆదాయ లక్ష్యంతో అధికారులు ఈ వేలం నిర్వహించగా, రెండు సైట్లలోనూ భూములను కొనుగోలు చేసేందుకు ఒక బిడ్డర్ కూడా ముందుకు రాకపోవడంతో వేలాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): మొదటి రోజు హుడా హైట్స్ లో ఒక బిడ్డర్ కూడా రాకపోవడంతో, రెండో రోజు నిర్వహించిన కీలక భూముల వేలంపై హెచ్ఎండీఏ భారీ ఆశలు పెట్టుకుంది. అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతంగా పేరుగాంచిన కోకాపేట్ నియోపోలిస్‌లోని 4.15 ఎకరాల భూమికి కనీస ధర (బిడ్ ప్రైస్) రూ. 120 కోట్లుగా నిర్ణయించారు. తీవ్ర రాజకీయ వివాదాలు, స్థానికుల ఆందోళనలు, హైకోర్టులో పిటిషన్ల నడుమ నిర్వహించిన మూసాపేట్ లోని 3.15 ఎకరాల (3 ఎకరాల 15 గుంటలు) ట్రక్ పార్ భూమికి కనీస ధర రూ. 99 కోట్లుగా ఖరారు చేశారు. ఈ రెండు అత్యంత విలువైన ప్రాంతాల్లోని భూముల వేలంలో పాల్గొనేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు గానీ, పెట్టుబడిదారులు గానీ ఏమాత్రం ఆసక్తి చూపలేదు.
గడువు ముగిసే సమయానికి ఒక బిడ్ కూడా దాఖలు కాకపోవడంతో హెచ్ఎండీఏ అధికారులు వేలం ప్రక్రియను వాయిదా వేయాల్సి వచ్చింది. మూసాపేట్ ట్రక్ పార్ భూముల వేలంపై హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో యధావిధిగా వేలం నిర్వహించి ఆ భూములను అధికార పార్టీకి చెందిన ఓ కీలక మంత్రి (నం.2 మంత్రి) సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. రా జకీయ వివాదాలు, విపక్షాల ఆందోళనలు, ప్రభుత్వ విధానాలపై పెట్టుబడిదారుల్లో నెలకొన్న అపనమ్మకం కారణంగానే వరుసగా రెండు వేలాలు విఫలమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వాయిదా పడిన ఈ భూ ముల వేలాన్ని తిరిగిఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై హెచ్ఎండీఏ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
దేనికి సంకేతం?
హెచ్ఎండీఏ ఈ-వేలంపై బిడ్డర్లు ఆసక్తి చూపకపోవడం దేనికి సంకేతమనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి. నగరంలో ఎక్కడ భూములు అమ్మకానికి పెట్టినా, వేలం నిర్వహించినా హాట్ కేకుల్లా అమ్ముడుపోయే పరిస్థితుల నుంచి ఒక్కరంటే ఒక్క రు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడానికి కారణాలు ఏమిటనేది చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు తో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడం, విదేశీ పెట్టుబడులు రాకపోవడంతో భూ ములకు డిమాండ్ తగ్గుతూ వస్తున్నది.
ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయలు కుమ్మరించి భూములు కొనుగోలు చేస్తే.. నష్టాలపాలవుతామని రియల్ ఎస్టే ట్ వ్యాపారులు, పెట్టుబడిదారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యాపారవేత్తలు నమ్మకం కోల్పోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తున్నది. మరోవైపు హైడ్రా బూచీతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీయడం కూడా పెద్ద దెబ్బగా కనిపిస్తున్నది.
ఫలించిన బీఆర్ఎస్ పోరాటం
ట్రక్ పార్క్ భూముల పరిరక్షణకు బీఆర్ఎస్ చేసిన పోరాటాలు ఫలించాయి. ఈ వేలంపాటను బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నది. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ట్రక్ పార్క్ భూములను రక్షించేందుకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వేలాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ..హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయాన్ని వందలాది మందితో ముట్టడించారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. భూముల వేలాన్ని ఆపాలని కోర్టులో పిటిషన్ కూడా వేశారు.
ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వంమొండివైఖరితో వేలం వేసినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి స్వాధీనం చేసుకుని ట్రక్ పార్క్‌కు తిరిగి కేటాయిస్తామని ప్రకటించారు. దీంతో బిడ్డర్లు వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని భావించి పెట్టుబడిదారులు వేలంలో పాల్గొనలేదు. రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టాలని చూసినా బీఆర్ఎస్ అడ్డుకుని కాపాడుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో ట్రక్ పార్క్ భూముల వేలం ఆగడంలో ప్రముఖ పాత్ర పోషించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

