84వేల దిగువకు సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ల మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, ఇంధన ధరలు మళ్లీ భగ్గుమనడంతో మదుపర్లు అమ్మకాల వైపు నడిపించాయి.
- ఒక్క శాతానికి పైగా నష్టపోయిన సూచీలు
ముంబయి, నవంబర్ 27: దేశీయ స్టాక్ మార్కెట్ల మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, ఇంధన ధరలు మళ్లీ భగ్గుమనడంతో మదుపర్లు అమ్మకాల వైపు నడిపించాయి. ఫలితంగా వరుసగా రెండు రోజులుగా భారీగా లాభపడిన సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో 1,100 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ వారంతపు ట్రేడింగ్ ముగిసే సరికి 989.33 పాయింట్లు లేదా 1.17 శాతం నష్టపోయి 83,339.26 వద్ద ముగిసింది.
మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 277.30 పాయింట్లు లేదా 1.07 శాతం తగ్గి 25,607.20 వద్ద స్థిరపడింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలకు ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలకు తోడు మళ్లీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండటంతో ఇంధన ధరలు పుంజుకోవడం మదుపర్లలో ఆందోళన రెకెత్తించింది. గడిచిన నాలుగు వారాలుగా భారీగా లాభపడిన సూచీల్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని, క్రూడ్ ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం, దేశీయ బాండ్ ఈల్డ్‌లు కూడా అధికం కావడం పతనానికి దోహదం చేశాయని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ఆసియా కృత్రిమ మేధ షేర్లలో పునరుత్తేజం రావడం వల్ల కొంత పెట్టుబడి భారత్ నుంచి మళ్లే అవకాశం ఉండటంతో ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాన్నారు. ఇటీవలి లాభాల తర్వాత టెక్నాలజీ, ఫైనాన్షియల్ హెవీవెయిట్ షేర్లలో మళ్లీ అమ్మకాలు జరగడం సూచీల పతనానికి ప్రధాన కారణమన్నారు. క్రూడ్ ధరల పెరుగుదల, రూపాయి బలహీనత, ప్రతిపాదిత అమెరికా సుంకాలపై అనిశ్చితి దీనికి తోడయ్యాయి తెలిపారు.
- శ్రీరామ్ ఫైనాన్స్ షేరు 4 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది.
- దీంతోపాటు హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐచర్ మోటర్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు రెండు శాతానికి పైగా కోల్పోయాయి.
- అలాగే జియోఫైనాన్స్, మారుతి, కొటక్ బ్యాంక్, మ్యాక్స్‌హెల్త్, అదానీపోర్ట్స్, బజాజ్‌ఫైనాన్స్, ఎటర్నల్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్ షేర్లు పతనం చెందాయి.
- కానీ, హెచ్ఏఎల్, బీఈఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటాన్, హిందాల్కో, ఎస్బీఐ లైఫ్, ఓఎన్జీసీ, ఇండిగో, టాటాస్టీల్, పవర్‌గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి.
- బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 0.70 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 0.45 శాతం పెరిగాయి.
- రంగాలవారీగా ఐటీ సూచీ అత్యధికంగా 1.53 శాతం నష్టపోగా, ఫోకస్డ్ ఐటీ 1.38 శాతం, రియల్టీ 1.35 శాతం, ఆటో 1.28 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.02 శాతం, ప్రైవేట్ బ్యాంక్స్ ఒక శాతం చొప్పున తగ్గాయి.
- క్యాపిటల్ గూడ్స్, కమోడిటీస్, ఇండస్టియ్రల్స్, టెలికమ్యూనికేషన్, మెటల్ రంగాలు లాభాల్లో ముగిశాయి.
- ఈవారంలో సెన్సెక్స్ 580.45 పాయింట్లు, నిఫ్టీ 193.4 పాయింట్లు పతనం చెందాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

