కరిగిపోతున్న విదేశీ నిల్వలు
విదేశీ మారకం నిల్వలు మరింత కరిగిపోయాయి. ఈ నెల 20తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 4.443 బిలియన్ డాలర్లు తరిగిపోయి 700.898 బిలియన్ డాలర్లకు పడిపోయాయని రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది.
ముంబయి, నవంబర్ 27: విదేశీ మారకం నిల్వలు మరింత కరిగిపోయాయి. ఈ నెల 20తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 4.443 బిలియన్ డాలర్లు తరిగిపోయి 700.898 బిలియన్ డాలర్లకు పడిపోయాయని రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతకుముందు వారంలోనూ మొత్తం నిల్వలు 14.205 బిలియన్ డాలర్లు తగ్గి 705.342 బిలియన్ డాలర్లకు చేరాయి.
విదేశాల్లోని భారతీయుల డిపాజిట్ల కోసం ప్రత్యేక రాయితీతో చేపట్టిన స్వాప్ పథకం కింద బ్యాంకులు రికార్డు స్థాయిలో 133 బిలియన్ డాలర్లు సమీకరించాయి. నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు నవంబర్ 20తో ముగిసిన వారంలో 266 మిలియన్ డాలర్లు తగ్గి 583.186 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. అలాగే బంగారం నిల్వలు వరుసగా రెండో వారం కూడా గణనీయంగా పడిపోయాయి. 4.095 బిలియన్ డాలర్లు తగ్గి 94.519 బిలియన్ డాలర్లకు చేరాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

