కాళేశ్వరంతో కరువుకు చోటులేదు
కేసీఆర్‌ను బద్నాం చేసే ప్రయ త్నంలో నీళ్లు రాకుండా, కరెంట్ ఇవ్వకుండా పంటలు పండకుండా చేసి తెలంగాణ రైతాంగాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నిలువునా ముంచారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
- కేసీఆర్‌ను బద్నాం చేసే ప్రయత్నంలో రేవంత్ రైతులను ముంచిండు: ఎంపీ ఈటల
హుజూరాబాద్, నవంబర్ 27 : కేసీఆర్‌ను బద్నాం చేసే ప్రయ త్నంలో నీళ్లు రాకుండా, కరెంట్ ఇవ్వకుండా పంటలు పండకుండా చేసి తెలంగాణ రైతాంగాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నిలువునా ముంచారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ అయిన తర్వాత తెలంగాణలో కరువుతో సంబంధం లేకుండా పంటలు పండాయని స్పష్టంచేశారు.
హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎండాకాలంలో కూడా ప్రాణహితనదిలో నీళ్లు ఉంటాయని, వాటిని ఎత్తి పోసుకోవాలని మేధావులు చెప్పినప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు వస్తాయని భ్రమలో బతుకుతున్నారని, నిజానికి ఓడిపోతానని ఆయనకు ఎప్పుడో అర్థమయిందని జోస్యం చెప్పారు. 1999 నుంచి 2004 వరకు భయంకరమైన కరువు వచ్చినా తెలంగాణ రైతాంగం తట్టుకొని నిలబడ్డదని గుర్తుచేశారు.
ఇప్పుడు ఒక్క కరువుకే చేతులెత్తేసి పంటలు వేయకండని చెప్పిన దుర్మార్గపు ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని మండిపడ్డారు. పంటలు వేసుకుంటే రైతులే బాధ్యులని, కరెంట్ ఇవ్వలేమని చెప్పడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికే చెల్లిందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంతో రూ.13కు యూనిట్ కొందామన్నా కరెంట్ దొరికే పరిస్థితి లేదని తెలిపారు. ఇప్పటికైనా రేవంత్ కరెంట్, నీళ్లు, పంటల గురించి ఏం చేయాలో ఆలోచించాలి అని హితవు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

