500 రోజుల భూ పోరాటం
- కాంగ్రెస్ సర్కార్ తీరుపై అలుపెరగకుండా ఉద్యోగుల సమరం
- అయినప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల చెరలోనే గోపన్‌పల్లి భూములు
- ప్రభుత్వం స్పందించే వరకు నిరసనలు
- బీటీఎన్జీవో అధ్యక్షుడు స్పష్టీకరణ
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి సర్వే నంబర్ 36లో కేటాయించిన భూములను దక్కించుకునేందుకు భాగ్యనగర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఏకంగా 500 రోజుల నుంచి అలుపెరగని పోరాటం కొనసాగిస్తున్నా కాంగ్రెస్ సర్కార్ కనికరించడం లేదు. ప్రభుత్వ పెద్దలు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై ఆ సొసైటీ ఉద్యోగులను అరిగోస పెడుతూనే ఉన్నారు. రూ.9 వేల కోట్ల విలువైన ఈ భూములను అప్పనంగా కాజేసేందుకు వారు వేసిన స్కెచ్‌ను నిరుడు జూలైలోనే ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. వాస్తవానికి రాష్ట్ర విభజనకు ముందు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం సర్వే నంబర్లు 36, 37లోని భూములను 4 ఉద్యోగ సంఘాలకు కేటాయించింది.
దీంతో 3 సంఘాల వాళ్లు ఏండ్ల క్రితమే అక్కడ ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. కానీ, అప్పటి ఏపీ ఎన్జీవో సంఘానికి సం బంధించిన భూముల్లో అధికారికంగా లేఅవుట్ అయినప్పటికీ అంతర్గత విబేధాలు తలెత్తడం, ఆపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇండ్ల స్థలాల పంపిణీ నిలిచిపోయింది. అనంతరం రాష్ట్ర విభజనతో ఏపీ ఉ ద్యోగులు సొంత రాష్ర్టానికి వెళ్లిపోవడంతో తెలంగాణ ఉద్యోగులు భాగ్యనగర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు.
కానీ, ఈ భూ ముల్లో తమకు చెందిన 91 ఎకరాల పట్టా భూములు ఉన్నాయంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తు లు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నాటి కలెక్టర్, ఆర్డీవో క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. భాగ్యనగర్ టీఎన్జీవోలకు కేటాయించి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 186 ఎకరాల్లో ప్రైవేట్ వ్యక్తులు క్లెయిమ్ చేస్తున్న 91 ఎకరాలు లేవని తేల్చి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో పైవేట్ వ్యక్తులు ఏమీ చేయలేకపోయారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పెద్దలు ఆ ప్రైవేట్ వ్యక్తులతో మిలాఖత్ కావడంతో పాత ప్రతిపాదనకు రాత్రికి రాత్రే రెక్కలొచ్చాయి. గతంలో కలెక్టర్ ఇచ్చిన నివేదికకు భిన్నంగా ప్రభుత్వ ఉద్యోగుల భూముల్లో ప్రైవేటు వ్యక్తులకు చెందిన 91 ఎకరాల భూములు ఉన్నాయంటూ వాటిని వారికి అప్పగించేందుకు భారీ స్కెచ్ వేశారు.
దీన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకురావడంతో అప్రమత్తమైన భాగ్యనగర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఉద్యోగులు.. ఆ భూముల్ని కాపాడుకునేందుకు రంగంలోకి దిగారు. అయినప్పటికీ ఆ ప్రైవేట్ వ్యక్తులు దౌర్జన్యంగా రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్ వేసి దాదాపు 40-50 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. వారిపై రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించి స్టేటస్కో ఉత్తర్వులు తీసుకురావడంతో భూ దందాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
సొంతింటి కల నెరవేరకుండానే చనిపోతున్నారు..

గోపన్‌పల్లి సర్వే నంబర్లు 36, 37లో మాతోపాటు భూములు తీసుకున్న మిగిలిన మూడు సొసైటీల్లోని ఉద్యోగులు ఏనాడో ఇండ్లు కట్టుకొని జీవిస్తున్నారు. కానీ, మా సొసైటీ ఉద్యోగులకు మాత్రం అది తీరని కలగానే మిగిలిపోతున్నది. ఆ మనోవేదనతో ఇప్పటికే ఎందరో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు చనిపోవడం వేదన కలిగిస్తున్నది. ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా మా భూముల్ని కబ్జా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. దీంతో స్వయంగా మేమే రంగంలోకి దిగి మా భూములను కాపాడుకునేందుకు పోరాడుతున్నాం. దీనిలో భాగంగా 500 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలని, ఉద్యోగుల కలను సాకారం చేసేందుకు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. లేకుంటే మా భూములు మాకు దక్కే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం.
– ముత్యాల సత్యనారాయణగౌడ్, బీటీఎన్జీవో (గచ్చిబౌలి) హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

