భద్రాద్రి కలెక్టరేట్ అద్భుతం!
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ భవనం అందంగా, చాలా అద్భుతంగా ఉన్నదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశంసించారు. కలెక్టరేట్ భవనాన్ని చూస్తుంటే హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం గుర్తుకొస్తున్నదని కొనియాడారు.
- హైదరాబాద్ సచివాలయాన్ని తలపిస్తున్నది: ఏపీ సీఎం
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 27: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ భవనం అందంగా, చాలా అద్భుతంగా ఉన్నదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశంసించారు. కలెక్టరేట్ భవనాన్ని చూస్తుంటే హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం గుర్తుకొస్తున్నదని కొనియాడారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలోని నవభారత్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన హోమం కార్యక్రమానికి చంద్రబాబు తన సతీమణితో కలిసి గురువారం హాజరయ్యారు.
హెలికాప్టర్లో కలెక్టరేట్ ఆవరణలో దిగిన చంద్రబాబుకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి, ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన చంద్రబాబు భవనం చాలా ఆకర్షణీయంగా ఉన్నదని, హైదరాబాద్ సచివాలయాన్ని తలపిస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన కలెక్టరేట్ భవనాలన్నీ చాలా బాగున్నాయని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలతో జిల్లా కలెక్టరేట్‌కు ప్రత్యేక గుర్తింపు లభించినట్టయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

