రేవంత్.. తిట్లు వద్దు, టీఎంసీల నీళ్లివ్వు!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు పర్యటనలో అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలను విమర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చారని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి విమర్శించారు.
- సాగు నీళ్లు ఎత్తిపోయమంటే.. ఢిల్లీకి డబ్బులు ఎత్తిపోస్తున్నడు
- మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి
- కాంగ్రెస్‌కు 9 సీట్లే : మర్రి జనార్దన్‌రెడ్డి
- సభలతో ప్రజాధనం వృథా: ఆల
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు పర్యటనలో అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలను విమర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చారని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి విమర్శించారు. పాలమూరు జిల్లాకు కావాల్సింది ముఖ్యమంత్రి తిట్లు కాదని, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా టీఎంసీల కొద్దీ నీళ్లని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఎత్తిపోయాలని సీఎంను కోరుతుంటే, ఆయన ఢిల్లీకి డబ్బుల మూటలు ఎత్తిపోస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణభవన్‌లో శుక్రవారం మీడియాతో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా వలసలు, నీటి సమస్యలతో ఉండేదని గుర్తుచేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులను పరుగులు పెట్టించి పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి 80% పనులు పూర్తి చేసిందని తెలిపారు. కరివెన వద్ద కొంత పని మిగిలి ఉన్నదని, తాము అధికారంలోకి వచ్చిఉంటే కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను నింపేవారమని అన్నారు.
హామీలు అమలవుతాయా?:మర్రి
ప్రతిపక్ష పార్టీల నాయకులను తిడితే హామీలు అమలవుతాయా? అని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘నీ కారు నంబర్ 9 లకీ నంబర్ కాబోతున్నది. నీకు 90 సీట్లు కాదు. 9 సీట్లు మాత్రమే వస్తాయి. గతంలో అచ్చంపేటకు వచ్చి గిరివికాసం కింద వంద రోజుల్లో సోలార్ పంప్సెట్లు ఇస్తామన్నావ్.. ఇవ్వకపోతే కలెక్టర్‌ను సస్పెండ్ చేస్తామన్నావ్.. ఇచ్చావా? ఇస్తే ఎకడ ఇచ్చావో చూపించు’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి సవాల్ విసిరారు. కొండారెడ్డిపల్లిలో ఇండ్లకు మాత్రమే సోలార్ ఇచ్చారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనతో జిల్లాకు అభివృద్ధి పనులు వస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైందని, సొంత నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కోరినా స్పందించలేదని విమర్శించారు. మహిళా సంఘాల సభ్యులను బలవంతంగా సభలకు తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 44.63 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని, ఏడు వేల పెన్షన్లు మాత్రమే పెరిగాయని పేరొన్నారు. దీనిపై చర్చకు సిద్ధమా? అని రేవంత్‌కు సవాల్ విసిరారు. వచ్చే రోజుల్లో రేవంత్‌రెడ్డిని ఓడించడం ఖాయమని పేర్కొన్నారు.
నీటికోసం పాలమూరు ఎదురుచూపు: ఆల
పాలమూరు ప్రజలు సాగునీటి కోసం ఎదురుచూస్తుంటే, ముఖ్యమంత్రి తిట్లతో కాలం గడుపుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. 15 రోజులకు ఒక సభ నిర్వహిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టడం లేదని దుయ్యబట్టారు. భూత్పూర్ సభలో ఏటా రూ. 20 కోట్లు ఖర్చు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు మూడేండ్ల్లలో రూ.60 కోట్లు కేటాయించారా? అని ప్రశ్నించారు. కొత్త ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు నిర్మించలేదని విమర్శించారు.
కోయిల్‌సాగర్ నుంచి నీటిని తరలించే ప్రతిపాదనతో ఆయకట్టు రైతులకు నష్టం కలిగే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఆయననేని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు అభిలాశ్ రంగినేని పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

