రేవంత్‌ను లెక్కచేయని అధికారులు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినా అధికారులు పట్టించుకోవడంలేదు. వరంగల్‌లోని కాళోజీ కళాక్షేత్రం విషయంలో ఇటీవల సీఎం ఇచ్చిన ఆదేశాల అమలులో జిల్లా కలెక్టర్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
- కాళోజీ కళా క్షేత్రంలోనే కుడా ఆఫీసు
- మార్చాలని వారం క్రితం సీఎం ఆదేశం
- పట్టనట్టు ఉంటున్న ఉన్నతాధికారులు
- కళాక్షేత్రంలోనే సిబ్బంది విధులు
హనుమకొండ, నవంబరు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినా అధికారులు పట్టించుకోవడంలేదు. వరంగల్‌లోని కాళోజీ కళాక్షేత్రం విషయంలో ఇటీవల సీఎం ఇచ్చిన ఆదేశాల అమలులో జిల్లా కలెక్టర్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వరంగల్ నగరానికి చారిత్రక గుర్తింపు పెంచేలా కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళోజీ కళాక్షేత్రంలోకి కుడా ఆఫీసును తరలించడాన్ని కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు.
కళాక్షేత్రంలో ప్రభుత్వ ఆఫీసు నిర్వహణ సరికాదని ‘నమస్తే తెలంగాణ’ గత వారం కథనాలు ప్రచురించింది. గత ఆదివారం వరంగల్‌లో బీఆర్ఎస్ జనచైతన్య సభను నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సభకు హాజరవుతున్నారనే సమాచారం నేపథ్యంలో కాళోజీ కళాక్షేత్రంలోకి కుడా ఆఫీసును తరలించిన విషయమై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం నిర్మించిన కళాక్షేత్రాన్ని కళ, సాహిత్య, సాంసృతిక కార్యక్రమాలకే కేటాయించాలని, ప్రభుత్వ కార్యాలయాలు తరలించొద్దని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ని ఆదేశించారు.
సీఎం ఆదేశాల అమలులో జిల్లా, కుడా ఉన్నతాధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కుడా ఆఫీసు నిర్వహించిన పాత భవనంలోనూ కొందరు సిబ్బంది ఉంటున్నారు. ప్రస్తుతం ఈ కార్యాలయాన్ని రెండు చోట్లా నిర్వహిస్తున్నారు. రెండు చోట్ల నిర్వహించి ప్రజల దృష్టిని మళ్లించి కాళోజీ కళాక్షేత్రంలోనే పూర్తిస్థాయిలో కొనసాగించేలా నిర్ణయించినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

