షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా?
సెమీ కండక్టర్ పరిశ్రమను రూ.20 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తామని చెప్పి 100 ఎకరాల భూమి పొందిన సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలాంటి పనులు చేపట్టకపోయినా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) రూ.500 కోట్ల రుణం మంజూరు చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది.
- ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు
- సెమ్ ఇండియా ఫ్యాబ్పై సీబీ‘ఐ’
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): సెమీ కండక్టర్ పరిశ్రమను రూ.20 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తామని చెప్పి 100 ఎకరాల భూమి పొందిన సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలాంటి పనులు చేపట్టకపోయినా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) రూ.500 కోట్ల రుణం మంజూరు చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ప్రాజెక్టు పనులు ప్రారంభించలేదని, కేవలం ఒక షెడ్ నిర్మాణానికే పరిమితమైందని పేరొంది.
క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించకుండా అంత భారీ రుణాన్ని ఏ ప్రాతిపదికన మంజూరు చేశారని ప్రశ్నించింది. రుణం ఇచ్చే సమయంలో కంపెనీ ఆర్థిక స్థితిగతులు, ప్రాజెక్టు పురోగతిని పరిశీలించకుండా పూచీకత్తుపైనే ఆధారపడినట్టు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఫ్యాబ్ సిటీలో సెమ్ ఇండియా ఫ్యాబ్‌కు కేటాయించిన 100 ఎకరాల్లో పనులు ప్రారంభించకపోవడంతో 78 ఎకరాలను వెనకి తీసుకునేందుకు ప్రభుత్వం 2010లో జీవో 9 జారీ చేసింది. ఈ నేపథ్యంలో రుణ రికవరీ చర్యలకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించకుండా ఆదేశించాలని కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం విచారణ చేపట్టారు.
భూమి స్వాధీన ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో 2011లో బ్యాంకు రుణం మంజూరు చేయడంపై న్యాయమూర్తి సందేహం వ్యక్తంచేశారు. భూమి స్వాధీనాన్ని సవాలు చేస్తూ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గతంలో కొట్టివేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో సీబీఐని ప్రతివాదిగా చేర్చుతూ, సంబంధిత పత్రాలన్నింటినీ సీబీఐ తరఫు న్యాయవాదికి అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. విచారణను డిసెంబరు 4కు వాయిదా వేశారు.
లక్ష్యం కాగితాలకే పరిమితం
మూడు దశల్లో పెట్టుబడులు, ఎనిమిది వేల ఉద్యోగాల లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. 2006 ఫిబ్రవరి 16న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెమ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నది. మూడు దశల్లో మొత్తం 2.25 బిలియన్ డాలర్ల పెట్టుబడితో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుచేసి ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పించాలనేది లక్ష్యం. మొదటిదశలో అసెంబ్లింగ్, టెస్టింగ్, మారింగ్, ప్యాకింగ్ యూనిట్, రెండో దశలో చిప్ తయారీ, మూడో దశలో అత్యాధునిక సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
ప్రాజెక్టులో పురోగతి లేకపోవడంతో 2008 జూన్ 19, నవంబర్ 17 తేదీల్లో కంపెనీకి నోటీసులు జారీ అయ్యాయి. 2009 మార్చి 21న జరిగిన బోర్డు సమావేశానికి కంపెనీ డైరెక్టర్ హాజరుకాలేదు. అదే ఏడాది జూలై 2న మరోసారి నోటీసు ఇవ్వగా, జూలై 18న కంపెనీ సమాధానం ఇచ్చింది. అయినప్పటికీ ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపించలేదు. 78 ఎకరాల భూమిని వెనకి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ సెమ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను 2023 మార్చి 20న హైకోర్టు కొట్టివేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

