ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కేసులు
- బావర్చీ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు
సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): బావర్చీ హోటల్లో మూడేండ్ల కిందట రాహుల్‌గాంధీ తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి.. మోసం చేసిన అంశంపై బీఆర్ఎస్ నేతలు మన్నెక్రిశాంక్, ముఠా జైసింహ, జగన్, దినేశ్ చౌదరి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ నిరసనను తట్టుకోలేక కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారు. బీఆర్ఎస్ నేత మన్నెక్రిశాంక్ వాహనంపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ దాడి చేస్తే..ఆ దాడిలో దినేశ్ చౌదరి అనే బీఆర్ఎస్ నేత గాయపడ్డారు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చీ రెస్టారెంట్లో గురువారం జరిగిన ఘర్షణలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి ఇరుపక్షాల ఫిర్యాదులపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. బావర్చీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై దాడి జరిగిందని శుక్రవారం బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు డీజీపీ, పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని, సీపీ టీవీ ఫుటేజ్, వీడియోల ఆధారంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో తమ ఉన్నతాధికారులు కేసు గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు హోటల్ లోపల దాడులు జరుగుతున్నా.. పోలీసులు సకాలంలో అడ్డుకోలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

