రిటైర్డ్ అధికారులకు రెడ్‌కార్పెట్
- గతంలో రేవంత్‌రెడ్డి ఆగ్రహం.. నేడు సీఎంగా ఆమోదం
- రఘునందన్‌రావు రీ-అపాయింట్మెంట్తో విమర్శలు
- సర్వీసులో ఉన్న సీనియర్లకు ప్రమోషన్ల గండం
- కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఉద్యోగవర్గాల అసంతృప్తి
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రిటైరైన అధికారులకు మళ్లీ ప్రభుత్వ కొలువులు, సర్వీసు పొడిగింపులు దక్కుతున్నాయి. కీలక పోస్టుల్లో పాతవారికే కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేస్తున్నది. తద్వారా ప్రమోషన్లకు దగ్గరిగా ఉన్న అధికారులకు తీవ్ర అన్యాయం చేస్తున్నది. రిటైర్డ్ ఐఏఎస్, పోలీస్ అధికారులను తిరిగి ప్రభుత్వంలో నియమించడం దారుణమంటూ గతంలో పీసీసీ చీఫ్‌గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆ మాటకు కట్టుబడటం లేదు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రిటైర్డ్ అధికారులకు దగ్గరుండి మరీ పునర్నియామక పత్రాలు ఇస్తున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ కానున్న 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎం రఘునందన్‌రావును ఉద్యోగ విరమణ అనంతరం రెవెన్యూ శాఖలో ప్రభుత్వ కార్యదర్శిగా (ఎక్సైజ్ అండ్ సీటీ) తిరిగి నియమిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలువురు రిటైర్డ్ అధికారుల సర్వీసును పొడిగించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సలహాదారులు, ఓఎస్డీలు, ప్రత్యేక బాధ్యతల పేరిట మరికొందరు విశ్రాంత అధికారులను కొనసాగిస్తున్నది.
ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ, ఇరిగేషన్, హైదరాబాద్ జలమండలి, పోలీస్ శాఖలకు ఈ వ్యవహారం విస్తరించింది. దీంతో అర్హులైన అధికారులకు ప్రమోషన్లు ఆలస్యమవడంతోపాటు ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతున్నది. ముఖ్యంగా ఇంజినీరింగ్ శాఖల్లో ఈఎన్సీ, సీఈ, ఎస్ఈ స్థాయిల్లో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న అధికారులకు తీవ్ర నిరాశ ఎదురవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

