మనసుల్ని తాకిన మంచి సినిమా
‘కల కనడం ఒక ఎత్తయితే.. దాన్ని సాకారం చేసుకోవడం ఒక ఎత్తు. సాకారం చేసుకున్న కలతో ఇంతటి విజయాన్ని సాధించడం మరో ఎత్తు. ఈ కలను ఈ టీమ్ చాలా ఏళ్లు మోశారు. వారి నమ్మకం ఈ రోజు నిజమైంది. అందుకే వారందరికీ నా అభినందనలు.
‘కల కనడం ఒక ఎత్తయితే.. దాన్ని సాకారం చేసుకోవడం ఒక ఎత్తు. సాకారం చేసుకున్న కలతో ఇంతటి విజయాన్ని సాధించడం మరో ఎత్తు. ఈ కలను ఈ టీమ్ చాలా ఏళ్లు మోశారు. వారి నమ్మకం ఈ రోజు నిజమైంది. అందుకే వారందరికీ నా అభినందనలు. ఈ కథ కనెక్టవ్వడానికి కథనం ప్రధాన పాత్ర పోషించింది. చాలా సన్నివేశాలు మనసును తాకాయి. డైలాగులు కూడా చాలా బావున్నాయి. యాక్టర్స్ అందరూ అద్భుతంగా నటించారు.
కల్పన పాత్రనే కాదు, సినిమాను కూడా భుజాలపై మోశాడు దుల్కర్ సల్మాన్. ఇంత మంచి సినిమాకు ఈ స్థాయిలో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. చూడని వాళ్లుంటే త్వరగా చూడండి’ అని అతిథిగా విచ్చేసిన ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి కథానాయిక. శ్రుతిహాసన్, రుహానీశర్మ కీలక పాత్రధారులు. పవన్ సాదినేని దర్శకుడు. అల్లు అరవింద్, స్వప్నదత్, సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మాతలు. ఈనెల 20న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో దిగ్విజయంగా ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడారు.
చిత్రకథానాయకుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘ఇది నాకు ఎమోషనల్ జర్నీ. తెలుగు ఇండస్ట్రీలో నేనూ భాగం అయినందుకు ఆనందంగా ఉంది. బెస్ట్ రైటర్స్, బెస్ట్ డైరెక్టర్స్ దొరకడం వల్లే ఇక్కడ సక్సెస్ కాగలిగాను. పవన్ సాదినేని వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. క్లారిటీతో మనసుపెట్టి సినిమా తీశాడు. నాకు అద్భుతమైన సినిమా ఇచ్చాడు. టీమ్‌గా కాదు, మేమంతా ఫ్యామిలీ మెంబర్స్‌గా ఈ సినిమాకు పని చేశాం. అందుకే ఈ విజయం. విజయానికి కారణమైన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు’ అని చెప్పారు. ఇంకా చిత్రబృందంతోపాటు ప్రముఖ నిర్మాతలు మైత్రీ రవి, సుప్రియ, కార్తికేయ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

