ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలి :కోలేటి
కేసీఆర్ నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష స్ఫూర్తితో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పిలుపునిచ్చారు.
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష స్ఫూర్తితో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో మలిదశ ఉద్యమానికి రాజకీయ వేదిక ఏర్పడిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో చర్చలు జరిపి ఉద్యమానికి రాజకీయ బలాన్ని చేకూర్చిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు.
కేసీఆర్ ఆమరణ దీక్షతోనే ఢిల్లీ కదలిందని, 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పాత్రపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఏలుబడిలో రాష్ట్రంలో అవినీతి, కమీషన్లు, రాజకీయ కక్ష సాధింపులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 29 దీక్షా దివస్‌ను తెలంగాణ ఉద్యమ చరిత్ర సంకల్ప దినంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

