ప్రజాభవన్‌ను ముట్టడించిన ఫార్మారైతులు
ఎన్నికల ముందు రైతులకు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఫార్మా బాధిత రైతులు శుక్రవా రం ప్రజాభవన్‌ను ముట్టడించారు.
రంగారెడ్డి, నవంబర్ 27 (నమస్తేతెలంగాణ)/యాచారం : ఎన్నికల ముందు రైతులకు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఫార్మా బాధిత రైతులు శుక్రవా రం ప్రజాభవన్‌ను ముట్టడించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల నుంచి 200 మందికి పైగా రైతు లు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అక్కడి చేరుకోగా, కన్వీనర్ కవుల సరస్వతి, తదితరులు ప్రజాభవన్‌లోని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షురాలు గ ద్వా ల విజయలక్ష్మికి తమ గోడు వినిపించా రు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేసి, ఆ భూములను రైతులకే ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి మూడేండ్లు దాటినా మోక్షం లేదని వాపోయారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ రెండున్నరవేలకు పైగా ఎకరాలను బలవంతంగా సేకరించారని వాపోయారు. తమ భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో పంట రు ణాలు, రైతుబంధు, రైతు భరోసా, ఎరువులు, చివరకు కరువు భత్యం కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
ఓ బాధిత రైతు తన కూతురు పెండ్లికోసం ఎకరం భూమిని కట్నంగా ఇచ్చారని.. ఈ భూమి నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు కాక, అత్తింటి వేధింపులు భరించలేక పెండ్లికూతురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. ఇలాంటి ఘటనలు అనేకంగా జరుగుతున్నాయని.. వెంటనే భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలని కోరారు. ఫార్మాసిటీని రద్దుచేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి ఆయనే ఫార్మా కంపెనీలు ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారని రైతులు మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

