అదనపు కలెక్టర్లుగా అవకాశం కల్పించాలి
- సీఎస్‌కు టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు వినతి
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పోస్టులను జెడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలకు పూర్తి అదనపు బాధ్యతలపై (ఎఫ్ఏసీ) అప్పగించాలని టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని సత్వరమే అమలు చేయాలని, బీఆర్కే భవన్లో ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్ట్ బోర్డు కార్యాలయానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శ్రీనివాసరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు శుక్రవారం వినతిపత్రం సమర్పించింది.
జెడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలకు అదనపు కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించడం వల్ల పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారుల ప్రతినిధి బృందం అభిప్రాయపడింది. కార్యక్రమంలో టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్, సీఈవో, డిప్యూటీ సీఈవో ఫోరం అధ్యక్షుడు, నల్లగొండ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఫోరం కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి జాయింట్ కమిషనర్ మోర శ్రీనివాస్, సహాధ్యక్షులు నరసింహులు, హనుమకొండ అదనపు కలెక్టర్ బీ శేషాద్రి, భూపాలపల్లి అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జెడ్పీ సీఈవోలు కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, చందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

