ప్రొటోకాల్ ఉల్లంఘనలను అరికట్టాలి
రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. తక్షణమే వాటిని అరికట్టి, నిబంధనలను సక్రమంగా అమలు చేయాలని శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజుకు ఫిర్యాదు చేశారు.
- పదవులు లేకున్నా కాంగ్రెస్ నేతలకు అధికారిక వేదికలపై చోటు
- తమ హకులు కాపాడాలని సీఎస్‌కు ఎమ్మెల్యేల ఫిర్యాదు
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. తక్షణమే వాటిని అరికట్టి, నిబంధనలను సక్రమంగా అమలు చేయాలని శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజుకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు.
ఎన్నడూ లేనంతగా ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయిస్తున్నారని, గెలిచినా తమకు మర్యాద ఉండటం లేదని వాపోయారు. నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరారు.
మర్యాద ఇవ్వడం లేదు : సుధీర్‌రెడ్డి
కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి అధికారిక పదవులు లేకున్నా ప్రభుత్వ కార్యక్రమాలు, సభల్లో వేదికలపై కూర్చుంటున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విమర్శించారు. నియోజకవర్గాల్లో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వేదికలపై కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మూడేండ్లుగా ఓపిక పట్టామని, అయినా పరిస్థితిలో మార్పు రాలేదని పేరొన్నారు. ఎమ్మెల్యేల హకులను కాపాడాలని సీఎస్‌ను కోరినట్టు తెలిపారు.
అరాచక పాలన : కేపీ వివేకానంద
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ విమర్శించారు. మూడేండ్ల నుంచి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. గతంలో నేతలకు గౌరవం ఉండేదని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉన్నదని ధ్వజమెత్తారు. దేశంలో ఒక రాజ్యాంగం.. ఇకడ రేవంత్ రాజ్యాంగం నడుస్తున్నదని ఆరోపించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై ఇప్పటికైనా స్పందించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

