ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి
దేశంలో సామాజిక న్యాయం, సమాన రాజకీయ ప్రాతినిధ్యం సాధించాలంటే కులగణనతోపాటు ఓబీసీలకు పార్లమెంట్, అసెంబ్లీల్లో రాజకీయ రిజర్వేషన్లు తప్పనిసరిగా కల్పించాలని అఖిల భారత ఓబీసీ ప్రజాప్రతినిధుల ఫోరం జాతీయ కన్వీనర్, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.
- కులగణనను పారదర్శకంగా,శాస్త్రీయంగా నిర్వహించాలి
- 80 కోట్ల మంది ఓబీసీలు అందరికీ ప్రాతినిధ్యం దక్కాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): దేశంలో సామాజిక న్యాయం, సమాన రాజకీయ ప్రాతినిధ్యం సాధించాలంటే కులగణనతోపాటు ఓబీసీలకు పార్లమెంట్, అసెంబ్లీల్లో రాజకీయ రిజర్వేషన్లు తప్పనిసరిగా కల్పించాలని అఖిల భారత ఓబీసీ ప్రజాప్రతినిధుల ఫోరం జాతీయ కన్వీనర్, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణనను పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాలని కోరారు.
న్యూఢిల్లీలోని తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో సుమారు 80 కోట్ల మంది ఓబీసీలు ఉన్నారని, వారి జనాభా ప్రాతిపదికన రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తిచేశారు. కులగణన లేకుండా రిజర్వేషన్లు కల్పిస్తే అవి న్యాయస్థానాల్లో నిలబడటం లేదని అన్నారు. రెండో విడత జనగణనలో కులగణన లేకపోవడంపై అభ్యంతరం తెలిపారు. కులగణన విషయంలో ప్రభుత్వం ఓబీసీలను మోసం చేస్తున్నదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.
డీలిమిటేషన్ ప్రక్రియలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా సీట్ల సంఖ్య పెంచితే ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీల్లో ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని స్పష్టంచేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని ఆరోపించారు. వెనుకబడినవర్గాలకు న్యాయం జరగకపోతే దేశవ్యాప్తంగా యువత, బీసీ వర్గాల నుంచి తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఓబీసీలకు న్యాయం చేసే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

