న్యూఢిల్లీ: కొత్తగా వేసిన రోడ్డును బీజేపీ మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోడ్డు నాణ్యతను ఎమ్మెల్యే ప్రశ్నించడాన్ని ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేశాడు. ఆగ్రహించిన ఆ మంత్రి అతడి చెంపపై కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Parvesh Verma slaps man) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. బీజేపీకి చెందిన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) మంత్రి పర్వేష్ వర్మ, తిలక్ నగర్లో కొత్తగా వేసిన రోడ్డును తనిఖీ చేశారు. ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్, కొత్తగా వేసిన ఆ రోడ్డును తన చేతితో లాగగా ముక్కలుగా ఊడి వచ్చింది. ఈ నేపథ్యంలో రోడ్డు నాణ్యత గురించి మంత్రి పర్వేష్ వర్మ, ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా వారిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
కాగా, ఆప్ కార్యకర్త అయిన ఒక వ్యక్తి దీనిని వీడియో రికార్డ్ చేయడంపై మంత్రి పర్వేష్ వర్మ ఆగ్రహించారు. ఆ వ్యక్తి చెంపపై ఆయన కొట్టారు. మంత్రిని ప్రతిఘటించేందుకు అతడు ప్రయత్నించగా ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మంత్రి పర్వేష్ వర్మ అకారణంగా తనపై చేయి చేసుకున్నట్లు సాహిబ్ సింగ్‌గా గుర్తించిన ఆ వ్యక్తి ఆరోపించాడు.
మరోవైపు బీజేపీ మంత్రి పర్వేష్ వర్మ తన చర్యను సమర్థించుకున్నారు. ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ తన అనుచరులతో కలిసి అక్కడికి వచ్చినట్లు తెలిపారు. వారిలో ఒకరు తన కుటుంబ సభ్యులను దూషించారని, అందుకే తాను ఆగ్రహంతో అలా స్పందించినట్లు ఒక వీడియోలో వివరించారు. అయితే మంత్రి పర్వేష్ వర్మ ఒక వ్యక్తి చెంపపై కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🚨 Delhi minister Parvesh Verma slaps man during road inspection.
Who gave a minister the right to slap a citizen? pic.twitter.com/TGfFy3EHIe
— Gems (@gemsofbabus_) September 27, 2026