డప్పు దరువుతో దీక్షాదివస్‌కు ఆహ్వానం!
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమైన దీక్షా దివస్‌కు బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెల 29న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రజలను ఆహ్వానిస్తూ ప్రచారం ముమ్మరం చేశాయి.
- 29న అలుగునూర్‌లో భారీ బహిరంగ సభ
- హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- సభా ప్రాంగణంలో ఏర్పాట్లు
- కరీంనగర్ గులాబీమయం
- ప్రజలంతా తరలిరావాలని గంగుల కమలాకర్ పిలుపు
కరీంనగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమైన దీక్షా దివస్‌కు బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెల 29న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రజలను ఆహ్వానిస్తూ ప్రచారం ముమ్మరం చేశాయి.
గురువారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో డప్పు చాటింపు కార్యక్రమాన్ని నిర్వహించాయి. మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా డప్పు కొడుతూ ప్రజలు సభకు రావాలని ఆహ్వానించారు. మరోవైపు అలుగునూర్ చౌర స్తా, సభా ప్రాంగణం పరిసరాల్లో భారీ కటౌ ట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా.. వేదిక ని ర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
గులాబీమయంగా కరీంనగర్
దీక్షా దివస్ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అలుగునూరు చౌరస్తా పరిసరాల్లో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటంతో ఆ ప్రాంతం గులాబీమయంగా మారిం ది. ప్రధాన నాయకులు వివిధ ప్రాంతాల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ నవంబర్ 29 నాటి దీక్షా దివస్ ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాన్ని ఏ మలుపు తిప్పిందో ప్రజలకు గుర్తుచేస్తున్నారు.
సభా ప్రాంగణంలో విస్తృత ఏర్పాట్లు
అలుగునూరు సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో నిర్వాహకులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదిక నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పార్కింగ్, ట్రాఫిక్ ని యంత్రణ తదితర అంశాలపై దృష్టిసారిస్తున్నారు. సభలో కేటీఆర్ ప్రసంగాన్ని అందరికీ స్పష్టంగా కనిపించేలా, వినిపించేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ తదితరులు గురువారం పరిశీలించి ఏర్పాట్లపై సూచనలు చేశారు.
ప్రజలంతా తరలిరావాలి : గంగుల
2009 నవంబర్ 29 తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న వివక్ష, వెనుకబాటుతనం, దోపిడీకి చరమగీతం పాడాలనే సంకల్పంతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారని తెలిపారు. తెలంగాణ సాధన కోసం పదవులు, రాజకీయ ప్రలోభాలను పక్కనపెట్టి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉద్యమాన్ని ముందుకు నడిపించారని కొనియాడారు. అలుగునూరు వద్ద కేసీఆర్‌ను అరెస్టు చేసినప్పటికీ ఉద్యమం ఆగలేదని, ఆ పరిణామంతో తెలంగాణవ్యాప్తంగా ఉద్యమం మరింత ఉధృతమైందని గుర్తుచేశారు. ప్రజా ఉద్యమం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రక్రియను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమవుతుందని, వేలాది మంది ప్రజలతో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, కవులు, మేధావులను ఘనంగా సన్మానించనున్నట్టు పేర్కొన్నారు. కరీంనగర్ నగరంతోపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో డప్పు చాటింపు ద్వారా సభ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

