బాబుకు ఎదురేగి వెళ్లి తుమ్మల స్వాగతం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాకు వచ్చారు.
- జిల్లాలోని టీడీపీ శ్రేణులను అడ్డుకొన్న పోలీసులు
- నిరసనకు దిగిన కార్యకర్తలు
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాకు వచ్చారు. పాల్వంచలోని నవభారత్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న హోమం కార్యక్రమానికి సతీసమేతంగా వచ్చిన చంద్రబాబు కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద హెలిపాడ్‌లో దిగారు. ఆయనకు స్వాగతం పలికేందుకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరర్రావుతోపాటు కాంగ్రెస్ నాయకులు వెళ్లడం గమనార్హం. ఇదే సమయంలో బాబు రాక కోసం ఉదయం నుంచి పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు వేచిచూశారు.
హారతులు పట్టేందుకు మహిళలు సిద్ధమయ్యారు. పోలీసులు అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మహిళలు అని చూడకుండా మగ పోలీసులు వారిని బయటకు నెట్టివేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆ తర్వాత నవభారత్ కార్యక్రమానికి వచ్చిన వెంటనే చంద్రబాబు మళ్లీ హెలికాప్టర్లో తిరుగు పయనమయ్యారు.
నవభారత్ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వాహకులు తుమ్మలను తప్ప ఇతర తెలంగాణ మంత్రులను కానీ, ఇక్కడి అధికారులను కానీ హోమం కార్యక్రమానికి పిలువకపోవడం చర్చ జరుగుతున్నది. గతంలో టీడీపీలో పనిచేసిన నేపథ్యంలోనే చంద్రబాబును కలిసేందుకు మంత్రి తుమ్మల వచ్చారని కొందరు అంటుండగా, ఇద్దరూ కలిసి రాజకీయంగా ఏమైనా అంతర్గత చర్చలు జరిపారా? అన్న అనుమానాలను మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి బాబు రాక కోసం చాలాసేపు మం త్రి తుమ్మల ఎదురుచూడటం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

