ప్రమాదంలో మన ప్రజాస్వామ్యం
బీజేపీ సొంతంగా మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యానికి, ఓటుహక్కుకు మరింత ప్రమాదం. ఇది ప్రజాస్వామికవాదుల నుంచి వినిపిస్తున్న మాట. మోదీ అధికారం చేపట్టి 13 ఏండ్లు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు. అంటే ప్రజాస్వామ్యం, మీడియా పట్ల ఆయనకున్న గౌరవం ఏపాటిదో అర్థమవుతున్నది. ఉత్తర కొరియా నియంత సైతం మీడియాతో మాట్లాడుతారు.
బీజేపీ సొంతంగా మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యానికి, ఓటుహక్కుకు మరింత ప్రమాదం. ఇది ప్రజాస్వామికవాదుల నుంచి వినిపిస్తున్న మాట. మోదీ అధికారం చేపట్టి 13 ఏండ్లు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు. అంటే ప్రజాస్వామ్యం, మీడియా పట్ల ఆయనకున్న గౌరవం ఏపాటిదో అర్థమవుతున్నది. ఉత్తర కొరియా నియంత సైతం మీడియాతో మాట్లాడుతారు. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో మాత్రం ప్రధాని మీడియా సమావేశంలో మాత్రం మాట్లాడరు. మెజార్టీ మీడియాను ఆయన మిత్రులు కొనేసినా అదే మీడియా సమావేశంలో మాట్లాడడానికి ప్రధాని ఇష్టపడరు. మనం చెప్పింది వినాలి. కానీ వాళ్లు ప్రశ్నించడం, మనం సమాధానం చెప్పడమా? అనే అహంకారభావానికి ఇది తార్కాణం.
మన దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచివున్నదో..మీడియా స్వేచ్ఛ ఎంత గొప్పగా ఉన్నదోనని అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ విడుదల చేసిన 95 పేజీల నివేదిక స్పష్టం చేస్తున్నది. మోదీ మిత్రుడు అదానీ అమెరికాలో లంచాలు ఇచ్చిన వ్యవహారంలో కేసు పెడితే, ‘భారత్‌పై దాడి’ అని ప్రచారం చేశారు. అదానీపై కేసు పెట్టినందుకే ‘దాడి’ అని ప్రచారం చేసినవారికి నియంతృత్వ పోకడలు, అన్ని వ్యవస్థలను బ్రష్టుపట్టిస్తున్న తీరుపై అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఇచ్చిన నివేదిక ‘విదేశీ కుట్ర’ అని తప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. వాస్తవానికి కేంద్ర సర్కార్ తన స్వార్థం కోసం అన్ని వ్యవస్థలను ఎలా నాశనం చేస్తున్నదో ప్రకటించడం ఇది మొదటిసారి కాదు.
దేశంలోని పలు సంస్థలు, వ్యక్తులు, పార్టీలు ఎప్పటినుంచో చెప్తున్న విషయాలను అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ మరింత వివరంగా చెప్పింది. ఈ సంస్థ ఎక్కడో అమెరికాలో కూర్చొని రహస్యంగా తయారుచేసిన నివేదిక కానేకాదు. 2025 జనవరి నుంచి 2026 సెప్టెంబర్ వరకు పరిశోధించి 40 మందికి పైగా ప్రముఖ వ్యక్తులతో మాట్లాడి నివేదికను రూపొందించింది. ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు, ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, జర్నలిస్ట్‌లు, పరిశోధకులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలతో మాట్లాడి దానిని రూపొందించింది. ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టుల తీర్పులు, వివిధ సంస్థల పరిశోధనలు, భారతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలను వారు పరిశీలించారు. పలువురిని ఇంటర్వ్యూ చేసి తుది నివేదిక ప్రకటించారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడడం పట్ల ఈ నివేదిక విచారం వ్యక్తం చేసింది. పార్లమెంట్లో ప్రతిపక్షానికి సంబంధించిన కీలక పదవులు కొంతకాలం ఖాళీగా ఉంచడం, ప్రశ్నించే అవకాశాలు లేకుండా చేయడంపై ఆ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాల కోసం పాలకులు ఇష్టారీతిన వాడుకుంటున్నారు.
2015 ఏప్రిల్ నుంచి 2025 వరకు 193 మంది రాజకీయ నేతలపై ఈడీ కేసులు నమోదు చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పదేండ్ల కాలంలో కేవలం 26 మంది రాజకీయ నాయకులపై మాత్రమే ఇలాంటి దర్యాప్తులు జరిగినట్టు నివేదిక స్పష్టం చేసింది. ప్రతిపక్ష నాయకులపై ఈడీ దాడి తర్వాత ఆ నాయకులు బీజేపీలో చేరిన తర్వాత దర్యాప్తులు నిలిచిపోయాయి. 2014 తర్వాత 23 మంది ప్రముఖ ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరిన తర్వాత అప్పటివరకు వారిపై ఉన్న అభియోగాలపై దర్యాప్తుల నుంచి ఉపశమనం లభించింది. రాజకీయ ప్రత్యర్థులు, సర్కార్‌ను విమర్శించే వారిని ఆర్థిక ఆరోపణలపై దర్యాప్తు జరుపడానికి సీబీఐని పాలకులు వాడుకుంటున్నారని ఆ నివేదిక పేర్కొన్నది.
పశ్చిమబెంగాల్లో కొంతకాలం కిందట జరిగిన ఒక సభలో తృణమూల్ కాంగ్రెస్ నేత సువేందు అధికారి రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ కెమెరాలకు చిక్కారని, జేబులో ఆ డబ్బు ఎలా పెట్టుకున్నారోనని ప్రధాని మోదీ వ్యంగ్యంగా నటించి చూపించారు. అయితే, అదే సువేందు అధికారిని బీజేపీలో చేర్చుకొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశారు. ఒక్క సువేందు విషయంలోనే కాదు..చాలామంది విషయంలో ఇదే జరిగింది. ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మని కూడా ఇలానే ఈడీ దాడితో బీజేపీలో చేర్చుకున్నారు. జ్యోతిరాదిత్య సింధియా, కెప్టెన్ అమరేందర్ సింగ్, హార్దిక్ పటేల్, జితిన్ ప్రసాద్, రవికిషన్ వంటి ఎంతోమంది కాంగ్రెస్‌లో ఉండగా అవినీతిపరులని ఆరోపించిన మోదీ..వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా?
ఎన్నికల కమిషన్ సైతం నిర్వీర్యంకావడాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇష్టానుసారం ఓటుహక్కును తొలగిస్తుండగా, అందుకు ప్రశ్నిస్తే ‘విదేశీ శక్తులు’ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు విప్లవాత్మకమైన సమాచార హక్కు చట్టం తీసుకువచ్చింది. మోదీ సర్కార్ వచ్చాక ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసింది. కేంద్ర సమాచార హక్కు కమిషన్‌గా ఉన్నప్పుడు మాడభూషి శ్రీధర్ ఇచ్చిన ఒక ఆర్డర్ ప్రధానికి కోపం తెప్పించింది. మోదీ విద్యార్హతల వివరాలు కావాలని కేజ్రీవాల్ పెట్టిన దరఖాస్తుపై వివరాలు ఇవ్వాల్సిందేనని కమిషన్ ఆర్డర్. కానీ ఈ ఆర్డర్ ప్రధానికి కోపం తెప్పించింది. దీంతో కోర్టుకు వెళ్లి ఆర్డర్ అమలు కాకుండా చూసుకోవడంతో పాటు కమిషన్ అధికారాలకు కత్తెర వేశారు. ఈ మార్పులతో సమాచార హక్కు కమిషన్‌ను నిర్వీర్యం చేశారు.
అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఇచ్చిన నివేదికను ‘అంతర్జాతీయ కుట్ర’ అనే రాజకీయ ప్రచారంతో తిప్పికొట్టడం కాదు. ఈ దేశం నియంతృత్వాన్ని సహించలేదు. జెన్ జీ ఉద్య మం పాలకులకు ఈ విషయం స్పష్టంగా చెప్పిం ది. వ్యక్తుల ప్రయోజనాల కంటే దేశంలో వ్యవస్థలు బతికి బట్టకట్టడానికి ప్రాధాన్యత లభించాలి. వ్యవస్థలు ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలి కానీ మోదీ స్వామ్యం కోసం కాదు.
బుద్దా మురళి
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

