రూ.1,500 కోట్లతో ‘వింటేజ్ కాఫీ ప్లాంట్’
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు ‘వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్' ముందుకొచ్చింది. సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో సుమారు రూ.1,500కోట్లతో రెండు దశల్లో ‘ఫ్రీజ్ డ్రైడ్ ఇన్స్టంట్ కాఫీ’ ప్లాంట్‌ను నిర్మించనుంది.
- వెయ్యి మందికి కొత్తగా ఉపాధి
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు ‘వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్’ ముందుకొచ్చింది. సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో సుమారు రూ.1,500కోట్లతో రెండు దశల్లో ‘ఫ్రీజ్ డ్రైడ్ ఇన్స్టంట్ కాఫీ’ ప్లాంట్‌ను నిర్మించనుంది. ఏటా 5,500మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో తొలిదశలో ఏర్పాటు చేయబోయే యూనిట్‌కు గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
దక్షిణాసియాలోనే మొట్టమొదటి సారిగా అత్యంత అధునాతమైన రోటో టెక్నాలజీని ఈ ప్లాంట్ వినియోగించనున్నట్టు, కొత్తగా వెయ్యి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనున్నట్టు వివరించారు. 2027 నాటికి ఈ ప్లాంట్ సామర్థ్యం 11వేల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పలు దేశాలకు ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ఫ్రీజ్ డ్రైడ్ ఇన్స్టంట్ కాఫీ ఎగుమతి అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ తాటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

