కాంగ్రెస్ పాలనలో పల్లెలు వెలవెల
కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలహీనపడి, అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
- మూడేండ్లలో భారీగా తగ్గిన పంచాయతీల అభివృద్ధి వ్యయం
- కేసీఆర్ హయాంలో గ్రామాలు కళకళ : కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలహీనపడి, అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో కళకళలాడిన పల్లెలు ఇవాళ నిధుల కొరతతో వెలవెలబోతున్నాయని గురువారం ఎక్స్ వేదికగా ఆయన పేరొన్నారు. బీఆర్ఎస్ హయాంలో మిగులు బడ్జెట్‌తో ఉన్న జీపీలు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆర్థిక లోటులోకి జారుకున్నాయని చెప్పారు.
2022-23లో గ్రామ పంచాయతీల సగటు వ్యయం రూ.16.59 లక్షలు ఉంటే 2024-25 నాటికి రూ.6.24 లక్షలకు పడిపోయిందని తెలిపారు. ఈ తగ్గుదలతో గ్రామాల్లో కొత్త అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా కేసీఆర్ కృషి చేశారని, రేవంత్‌రెడ్డి పాలనలో అవినీతి, అరాచకం కారణంగా పల్లెలు ఇబ్బందులు ఎదురొంటున్నాయని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ఆధారంగా ఓ దినపత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

