ప్రతి అమెరికా చిన్నారికి రెండు స్పేస్ఎక్స్ షేర్లు!
అమెరికాలోని ప్రతి చిన్నారికి స్పేస్ఎక్స్ సంస్థ షేర్లు రెండు ఇస్తానని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు. కంపెనీ తరఫున ఒక షేర్, తన వ్యక్తిగత వాటా నుంచి మరో షేర్ అందజేస్తానని గురువారం ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు.
- ఎలాన్ మస్క్ ప్రకటన
వాషింగ్టన్: అమెరికాలోని ప్రతి చిన్నారికి స్పేస్ఎక్స్ సంస్థ షేర్లు రెండు ఇస్తానని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు. కంపెనీ తరఫున ఒక షేర్, తన వ్యక్తిగత వాటా నుంచి మరో షేర్ అందజేస్తానని గురువారం ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు.
అంతరిక్షంలో కృత్రిమ మేధ డాటా సెంటర్ నెట్వర్క్ కోసం ‘స్టార్మైండ్’ పేరిట 10 లక్షల వరకు ఉపగ్రహాలను మోహరించేందుకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) స్పేస్ఎక్స్కు అనుమతి ఇచ్చిన తర్వాత మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘అమెరికాలోని ప్రతి చిన్నారికి స్పేస్ఎక్స్ ఇచ్చే షేర్‌ను వచ్చే నెలలో బదిలీ చేస్తాం.
నా లాకప్ గడువు వచ్చే ఏడాది జూన్‌లో ముగిసిన తర్వాత నా వ్యక్తిగత షేర్‌ను బదిలీ చేస్తాను’ అని మస్క్ పేర్కొన్నారు. ప్రతి అమెరికా చిన్నారికి రెండు షేర్లు ఇవ్వాలన్న మస్క్ ప్రతిపాదన విలువ రూ.166.51 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

