ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సైబరాబాద్ మూవ్స్
సైబరాబాద్ వంటి వేగంగా విస్తరిస్తున్న మహానగర ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య అనేది కేవలం వాహనాల సంఖ్యకు సంబంధించిన అంశం కాదు.
- సమగ్ర ట్రాఫిక్ నిర్వహణకు ప్రాధాన్యం
సైబరాబాద్ వంటి వేగంగా విస్తరిస్తున్న మహానగర ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య అనేది కేవలం వాహనాల సంఖ్యకు సంబంధించిన అంశం కాదు. పెరుగుతున్న ఐటీ సంస్థలు, కార్యాలయాలు, నివాస సముదాయాలు, విద్యాసంస్థలు, వాణిజ్య కేంద్రాలు, వీటన్నింటి కారణంగా ప్రతిరోజూ వేలాది మంది ఒకే సమయానికి రహదారులపైకి వస్తున్నారు. ఫలితంగా ప్రయాణ సమయం పెరగడం, కూడళ్ల వద్ద వాహనాలు నిలిచిపోవడం, పీక్ అవర్స్‌లో తీవ్ర రద్దీ, అత్యవసర వాహనాలకు మార్గం కల్పించడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
ఈ పరిస్థితిని కేవలం ట్రాఫిక్ సిబ్బందిని పెంచడం, జరిమానాలు విధించడం లేదా రద్దీ సమయంలో వాహనాలను మళ్లించడం ద్వారా పరిషరించలేమనే ఆలోచనతో సైబరాబాద్ పోలీసులు చేపట్టిన కార్యక్రమమే ‘సైబరాబాద్ మూవ్స్ ’. ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ట్రాఫిక్‌ను నియంత్రించడం మాత్రమే కాకుండా, ప్రయాణ వ్యవస్థను సమర్థవంతంగా మార్చడం. రహదారులపై ఉన్న సమస్యలను గుర్తించడం, వాటికి సాంకేతిక పరిజ్ఞానంతో పరిషారాలు కనుగొనడం, ప్రజల భాగస్వామ్యంతో ప్రయాణాన్ని సులభతరం చేయడం ఈ విధానంలో కీలక అంశాలు.
సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ సమస్యకు పరిషారం అంటే రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం మాత్రమే కాదని, ఉన్న రహదారుల సామర్థ్యాన్ని మెరుగ్గా వినియోగించుకోవడం, ప్రతి ఒక్కరు ఒక్కో వాహనాన్ని తీసుకుని రోడ్డుపైకి రావడం కాకుండా ఒకే వాహనంలో ఎకువ మంది ప్రయాణించేలా ప్రోత్సహించడం, ప్రజా రవాణాను బలోపేతం చేయడం కూడా అంతే ముఖ్యమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్ ప్రతిపాదించారు. ట్రాఫిక్ రద్దీ వెనుక ఉన్న అసలు కారణాలను పరిశీలిస్తే… ఒకే కార్యాలయ ప్రాంతానికి ఒకే సమయంలో వేలాది మంది వ్యక్తిగత వాహనాల్లో చేరుకోవడం ప్రధాన సమస్యగా కనిపిస్తోంది.
ముఖ్యంగా జేఎన్టీయూ వైపు నుంచి ఐకియా, హైటెక్ సిటీ ఐటీ కారిడార్ వైపు వచ్చే ప్రయాణికుల్లో సుమారు 65 శాతం మంది గంటన్నర వ్యవధిలోనే ఆ మార్గంలోకి చేరుకుంటున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ ఒక అంశమే ప్రయాణ సమయాల సమన్వయం, ఉద్యోగుల రాకపోకల నిర్వహణ ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది. అందుకే డాక్టర్ రమేశ్ ప్రజలకు ఇచ్చిన పిలుపు కేవలం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే విజ్ఞప్తికి పరిమితం కాలేదు. ‘హాయ్ బోలో…దిల్ ఖోలో….నో సోలో….సాత్ చలో!’ అనే నినాదంతో ఒంటరిగా ప్రయాణించే అలవాటును తగ్గించి, కార్ పూలింగ్, బైక్ షేరింగ్, ప్రజా రవాణాను ప్రోత్సహించాలని సీపీ ప్రజలు, ఉద్యోగులను కోరుతున్నారు.
అంటే ట్రాఫిక్ సమస్య పరిషారంలో పోలీసులకే కాకుండా ప్రతి ప్రయాణికుడికి బాధ్యత ఉందన్న సందేశాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ దిశగా ఫీనిక్స్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు తమ ఉద్యోగుల్లో షేర్డ్ ట్రాన్స్ పోర్ట్‌ను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఐటీ సంస్థలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలతోనూ పోలీసులు చర్చలు జరిపారు. తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు వేర్వేరు వాహనాల్లో కాకుండాకలిసి ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయాలు

1. ఐటీ కారిడార్ లో వన్ వే లూప్ విధానం
బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి మైండ్ స్పేస్ , నాలెడ్జ్ సిటీ, హైటెక్ సిటీ వరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వన్ వే లూప్ విధానాన్ని పరిశీలిస్తున్నారు. టీ హబ్ , ఐకియా, నాలెడ్జ్ సిటీ, మైండ్ స్పేస్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం దీని లక్ష్యం.
ఈ ప్రతిపాదనపై పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్, జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్ ) సన్‌ప్రీత్ సింగ్ తదితరులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. భవనాల నుంచి వచ్చే వాహనాల సంఖ్య, పారింగ్ సదుపాయాలు, రహదారుల సామ ర్థ్యం, ట్రాఫిక్ బాటిల్ నెక్స్ వివరాలతో సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశి ంచారు.అయితే ఈవన్ వే విధానం ప్రస్తుతం అధ్యయన, ప్రతిపాదన దశలోనే ఉంది.
2. ప్రత్యేక బస్ లేన్ల ఏర్పాటుపై దృష్టి
జేఎన్టీయూ జంక్షన్ -హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో స్టేషన్ మార్గంలో సుమారు ఏడు కిలోమీటర్ల మేర కౌంటర్ ఫ్లో బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (బిఆర్‌టి) విధానాన్ని పరిశీలిస్తున్నారు. సాధారణ వాహనాల రాకపోకలకు భిన్నంగా బస్సుల కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయడం ఈ ప్రతిపాదన ఉద్దేశం. ఈ మార్గంలో రోడ్డు వెడల్పు, ఫుట్ పాత్‌లు, బస్‌స్టాప్‌లు, యూటర్న్లు, పారింగ్ , ఆక్రమణలు, కూడళ్ల వద్ద అడ్డంకులపై సర్వే నిర్వహించారు. ట్రాఫిక్ అధికారులు తక్షణమే అమలు చేయగలిగే తకువ ఖర్చుతో కూడిన మార్పులను గుర్తించాలని సూచించారు. ప్రయోగాత్మక నిర్వహణ ఫలితాలను పరిశీలించిన తర్వాత బస్ షెల్టర్లు వంటి శాశ్వత సదుపాయాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
3. మెట్రో, ఆర్టీసీ సేవలకు ప్రాధాన్యం
వ్యక్తిగత వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు మెట్రో రైలు, టీజీఎస్ ఆర్టీసీ బస్సుల వినియోగాన్ని పెంచాలని కమిషనర్ పిలుపునిచ్చారు. రద్దీ మార్గాల్లో అదనపు బస్సులను నడిపేందుకు ఆర్టీసీతో సమన్వయం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సైబరాబాద్ పోలీసు కమిషనర్ డా.ఎం.రమేశ్ స్వయంగా రసూల్ పురా నుంచి రాయదుర్గం వరకు మెట్రోలో ప్రయాణించి, ప్రజా రవాణా వినియోగంపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు.
4. సైక్లిస్టులకు ప్రత్యేక మార్గాలు.. పాదచారులకు భద్రత
సైకిళ్లపై ప్రయాణించే వారికి సురక్షితమైన మార్గాలు కల్పించడం, పాదచారులకు అనుకూలమైన ఫుట్ పాత్లను అభివృద్ధి చేయడం కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉంది. నవంబర్ 26 నుంచి 28 వరకు జరిగే కార్యక్రమంలో సైక్లిస్టుల కోసం ప్రత్యేక లేన్లను గుర్తించి భద్రత కల్పించనున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. రహదారులు కేవలం కార్లు, బైకుల కోసమే కాకుండా సైక్లిస్టులు, పాదచారులకు కూడా సమానంగా ఉపయోగపడాలన్న దృక్పథంతో పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
5. విద్యార్థుల భాగస్వామ్యంతో రోడ్డు భద్రత
ట్రాఫిక్ సమస్య పరిషారంలో విద్యార్థులను సైతం భాగస్వాములను చేయడం మరో ముఖ్యమైన నిర్ణయం. సుమారు 400కు పైగా విద్యాసంస్థల్లో 3.5 లక్షల మంది విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, కూడళ్ల వద్ద ప్రయాణ భద్రతపై అవగాహన కల్పించినట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థుల సూచనలను కూడా నగర ప్రయాణ వ్యవస్థ మెరుగుదలకు ఉపయోగించుకోవాలనే ఆలోచనతో చర్యలు చేపడుతున్నారు.
6. సీసీటీవీలు, వెహికల్ కౌంటర్లతో ట్రాఫిక్ విశ్లేషణ
ట్రాఫిక్ రద్దీని అంచనాలతో కాకుండా వాస్తవ గణాంకాలతో విశ్లేషించేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగించేందుకు సన్నద్ధమయ్యారు. ముఖ్యంగా సీసీటీవీ నెట్ వర్లు, ఆటోమేటిక్ వెహికల్ కౌంటింగ్ యంత్రాలు, ట్రాఫిక్ డేటా ఆధారంగా సాధారణ రోజుల్లోని రద్దీని, కార్ పూలింగ్ , ప్రజా రవాణా వినియోగం పెరిగిన రోజుల్లోని పరిస్థితిని పోల్చి చూడనున్నట్లు పోలీసులు వివరించారు. తద్వారా ఏ చర్య వల్ల ఎంతమేరకు రద్దీ తగ్గిందో అంచనా వేయవచ్చనేది పోలీసుల అభిప్రాయం.
వన్ వే అమలు:వాహనదారులకు ప్రత్యామ్నాయమార్గాలు అందుబాటులో ఉండాలి. ఒక ప్రాంతంలో రద్దీ తగ్గి మరో ప్రాంతంలో పెరగకుండా అధ్యయనం అవసరం.
కార్ పూలింగ్: ఉద్యోగులకు భద్రత, ప్రయా ణ సౌలభ్యం, సమయపాలనపై నమ్మకం కల్పించాలి. ప్రోత్సాహకాలు అందించాలి.
ప్రజా రవాణా: మెట్రో, ఆర్టీసీ మధ్య సమన్వయం, తగిన సంఖ్యలో బస్సులు, చివరి మైలు కనెక్టివిటీ మెరుగుపడాలి.
పాదచారుల భద్రత: ఫుట్ పాత్ల ఆక్రమణలు తొలగించి, సురక్షితమైన రోడ్డు దాటే సదుపాయాలు కల్పించాలి.
అమలు పర్యవేక్షణ: ప్రకటించిన ప్రతిపాదనలు ఎంతవరకు అమలయ్యాయి? ప్రయాణ సమయం ఎంత తగ్గి ంది? అనే అంశాలపై ప్రజా నివేదికలు అవసరం.
ట్రాఫిక్ సమస్య పోలీసుల ఒకరి బాధ్యత కాదు: సైబరాబాద్ సీపీ డా. ఎం.రమేశ్
ట్రాఫిక్ సమస్యను పోలీసులపై మాత్రమే వదిలేయకుండా, ప్రజలు కూడా తమ ప్రయాణ అలవాట్లలో మార్పు తీసుకురావాలి. ప్రభుత్వ శాఖలు మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ఐటీ సంస్థలు ఉద్యోగుల ప్రయాణ విధానాలను పునరాలోచించాలి. పౌరులు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని అవసరమైన మేరకే పరిమితం చేయాలి. సైబరాబాద్ ప్రాంతంలో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్న నేపథ్యంలో అకడి ట్రాఫిక్ సమస్య కేవలం స్థానిక సమస్య కాదు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఐటీ రంగ ఉత్పాదకత, పర్యావరణం, ప్రజల జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న అంశం.
ఫ్లెఓవర్లు కట్టడం ద్వారా రహదారులపై వాహనాల సంఖ్యను తగ్గించలేం. కానీ ఒకే వాహనంలో నలుగురు ప్రయాణిస్తే మూడు వాహనాల అవసరం తగ్గుతుంది. ‘సైబరాబాద్ మూవ్స్ ’ విజయాన్ని 3 రోజుల కార్యక్రమానికి వచ్చిన స్పందనతో కాకుండా, రాబోయే రోజుల్లో రహదారులపై తగ్గిన వాహనాల సంఖ్య, ఆదా అయిన ప్రయాణ సమయం, పెరిగిన ప్రజా రవాణా వినియోగం, మెరుగైన రోడ్డు భద్రతతో కొలవాల్సి ఉంటుంది. నగరం వేగంగాఅభివృద్ధి చెందడం ఎంత ముఖ్య మో..ఆ నగరంలో నివసించే, పనిచేసే ప్రతి ఒకరికీ సాఫీగా ప్రయాణించే అవకాశం కల్పించడం కూడా అంతే ముఖ్యం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

