కాంగ్రెస్ గూండాయిజం
కాంగ్రెస్ గూండాలు పెను విధ్వంసం స్పష్టించారు.. కర్రలు, రాడ్లతో విరుచుకుపడ్డారు.. శాంతియుత నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులపై విచక్షణారహితంగా దాడికి దిగారు. అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యకాండకు తెగబడ్డారు. భయభ్రాంతులకు గురిచేశారు. రాహుల్ గాంధీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బావర్చి హోటల్‌కు వచ్చి బిర్యానీ తింటూ ..
- బావర్చి హోటల్‌పై కాంగ్రెస్ మూకల దాడి
- రాహుల్ ఫొటోకు బిర్యానీ తినిపిస్తూ.. బీఆర్ఎస్ నేతల నిరసన
- రాడ్లు, కర్రలతో విరుచుకుపడిన కాంగ్రెస్ రౌడీలు.. పలువురికి గాయాలు
బావర్చి హోటల్ సాక్షిగా.. కాంగ్రెస్ గూండాలు పెను విధ్వంసం స్పష్టించారు.. కర్రలు, రాడ్లతో విరుచుకుపడ్డారు.. శాంతియుత నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులపై విచక్షణారహితంగా దాడికి దిగారు. అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యకాండకు తెగబడ్డారు. భయభ్రాంతులకు గురిచేశారు. రాహుల్ గాంధీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బావర్చి హోటల్‌కు వచ్చి బిర్యానీ తింటూ .. ఏటా జాబ్ క్యాలెండర్ ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసినందుకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో గురువారం నిరుద్యోగులు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ క్రమంలో రాజ్య సభ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మోతె రోహిత్.. కాంగ్రెస్ గూండాలు చొరబడి విధ్వంసం సృష్టించారు. హోటల్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. వందలాది మంది ఒక్కసారిగా హోటల్లోకి దూసుకొచ్చి కర్రలు, రాడ్లతో దాడి చేయడంతో బీఆర్ఎస్ నేతలు గాయపడ్డారు. కస్టమర్లు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా ఈ ఘటనపై చిక్కడపల్లి పీఎస్‌లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు .

సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మూకల విధ్వంసం వల్ల ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ రౌడీలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు, నిరుద్యోగులు నినాదాలు చేశారు.ఈ క్రమంలో మన్నె క్రిశాంక్‌పై దాడికి యత్నించారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చేసిన మో సాన్ని ప్రశ్నించినందుకు దాడులకు ప్రయత్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హామీలు అమలుచేయాలని అడిగితే దాడు లు చేస్తా రా?అంటూ నిలదీశారు.కాంగ్రెస్ ప్రభుత్వం, ఆపార్టీ గూండాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రశ్నించడం ఆపబోమని హెచ్చరించారు.

క్రిశాంక్ కారు ధ్వంసం
రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మోతె రోహిత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూండాలు శాంతియుతంగా బిర్యానీ తింటూ నిరసన తెలుపుతున్న మన్నె క్రిశాంక్, ముఠా జయసింహ, పాటిమీది జగన్, దినేశ్ చౌదరి, విష్ణువర్ధన్‌రెడ్డి, సహా బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే బీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారు. అదేవిధంగా అక్కడే ఉన్న మన్నె క్రిశాంక్ కారును పూర్తిగా ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ నాయకుడు దినేశ్‌తో పాటు పలువురు గాయపడ్డారు.కాంగ్రెస్ గూండాలు విధ్వంసం సృష్టిస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు.

కర్రలు..ఇనుప రాడ్లతో..
120 మంది కాంగ్రెస్ గూండాలు కర్రలు, ఇనుప రాడ్లతో హోటల్లోకి దూసుకెళ్లి దాడి చేశారు. హోటల్ యజమాని వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా ఆయనపై కూడా దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కస్టమర్లను కూడా బయటకు పంపించి, లైట్లు ఆపేసినా దాడిని కొనసాగించారు. 120 మంది మూకుమ్మడిగా దాడి చేయడంతో కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. వందలాదిగా కర్రలు, ఇనుప రాడ్లతో విరుచుకపడటంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ఆపేందుకు ప్రయత్నించినా వినకుండా హోటల్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

