రేవంత్, భట్టి క్షమాపణలు చెప్పాలి
‘కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు మరోసారి అవమానం జరిగింది.
- రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రకటనల్లో కనిపించని అంబేద్కర్ ఫొటో
- ఇది పూర్తిగా సర్కార్ తప్పిదమే
- బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, తక్కెళ్లపల్లి రవీందర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్
- తెలంగాణ భవన్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
- బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులు
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ):‘కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు మరోసారి అవమానం జరిగింది. రాజ్యాంగ దినోత్సవం రోజైన గురువారం ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో తమ ఫొటోలు ముద్రించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోకు చోటివ్వకపోవడం ప్రభుత్వ తప్పిదమే. దానికి సీఎం, డిప్యూటీ సీఎం నైతిక బాధ్యత వహించి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌కుమార్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఫొటో లేకుండా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన పత్రికా ప్రకటనలను ఈ సందర్భంగా వారు మీడియాకు చూపించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేసి గౌరవించిన చరిత్ర కేసీఆర్దైతే, అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానిస్తున్న చరిత్ర రేవంత్‌రెడ్డిదని మండిపడ్డారు.
ఓటుకు నోటు దొంగలు సీఎంలుగా చెలామణి: దాసోజు
ఓటుకు నోటు దొంగలు సీఎంలుగా చెలామణి అవుతుండటం దురదుష్టకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆందోళన వ్యక్తంచేశారు. భారత పౌరుల హకులు, బాధ్యతలను రాజ్యాంగం అందరికీ గుర్తుచేస్తుందని చెప్పారు. భారత రాజ్యాంగస్ఫూర్తిని అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందు పరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, అందుకే కేసీఆర్ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించారని గుర్తుచేశారు.
రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలి: తక్కెళ్లపల్లి
భారత ప్రజలంతా రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. రాజ్యాంగ సూత్రాల ప్రకారమే కేసీఆర్ తెలంగాణను సాధించారని చెప్పారు. విచ్చలవిడి హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలును విస్మరించిందని విమర్శించారు. అబద్ధపు హామీలతో ఒక టర్మ్ అధికారంలోకి వచ్చి అందినకాడికి దోచుకోవాలనేది కాంగ్రెస్ సర్కార్ విధానంగా మారిందని మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పోరాడాలని కోరారు.
రేవంత్ పాలనలో కుల వివక్ష: ఎర్రోళ్ల
కులవివక్షకు వ్యతిరేకంగా అంబేదర్ పోరాడారని, కానీ రేవంత్ పాలనలో అడుగడుగునా కులవివక్ష కనిపిస్తున్నదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తంచేశారు. అంబేద్కర్ పేరు ఉన్నదనే రేవంత్‌రెడ్డి సచివాలయానికి సక్రమంగా వెళ్లడం లేదని, 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారనే సీఎం ఆ విగ్రహాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
అంబేద్కర్ అభయహస్తాన్ని, చేవెళ్ల డిక్లరేషన్ అమలును మరిచారని విమర్శించారు. అణగారిన వర్గాలను విస్మరిస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు విద్యాసాగర్, కిశోర్‌గౌడ్, కురువ విజయ్‌కుమార్, తుంగ బాలు, కొమ్ముల నరేందర్, ముఖీత్ చాందా, మమత, చారులత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

