ట్రక్ పార్క్ భూముల వేలంపై విచారణ
కూకట్‌పల్లిలోని హుడా ట్రక్‌పార్క్ స్థలం వేలంపాటను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనల అనంతరం ఉత్తర్వులను వా యిదా వేసింది.
- ఉత్తర్వులు వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 26(నమస్తే తెలంగాణ): కూకట్‌పల్లిలోని హుడా ట్రక్‌పార్క్ స్థలం వేలంపాటను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనల అనంతరం ఉత్తర్వులను వా యిదా వేసింది. మూసాపేటలోని 3.15 ఎకరాల భూమిని శుక్రవారం వేలం వేసేందుకు హెచ్ఎండీఏ జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సామాజిక కార్యకర్త మాధవరం కాంతారావు వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యామ్ కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావుతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు బీ మయూర్‌రెడ్డి, గండ్ర మోహన్‌రావు, బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. 45 ఏండ్ల క్రితం ఈ భూమిని ప్రజాప్రయోజనాల కోసం సేకరించారని తెలిపారు. ఏ ప్రయోజనం కోసం భూమిని సేకరించారో దానికే వినియోగించాల్సి ఉన్నదని, ఒకవేళ అలా సాధ్యం కాకపోతే దీనిపై అధ్యయనం చేసి ఇతర ప్రజాప్రయోజనాలకు వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వేలం ద్వారా వచ్చే సొమ్మును ఇతర ప్రజాప్రయోజనాలకు వినియోగిస్తామనడం చట్టబద్ధం కాదని, ఇది భూసేకరణ చట్టం స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. ఆ భూమిని ప్రైవేట్ రియల్ఎస్టేట్ వ్యాపారానికి వినియోగిస్తున్నారని, అకడ షాపింగ్‌మాల్ మారింగ్ కూడా ఉన్నదని తెలిపారు.
షాపింగ్‌మాల్ నిర్మాణం ఏరకంగా ప్రజాప్రయోజనమో ప్రభుత్వానికే తెలియాలని వ్యాఖ్యానించారు. ఎలాంటి అధ్యయనం లేకుండా భూమిని వేలం వేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ఒకసారి వేలం వేయడానికి ప్రయత్నించగా, నిరసనలతో ఆగిపోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ నెల 27న నిర్వహించనున్న వేలాన్ని నిలిపివేయాలని కోరారు. అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రయోజనం పేరుతో వేసిన ఈ పిటిషన్ విచారణార్హం కాదన్నారు. పిటిషనర్లలో ఎమ్మెల్యే ఉన్నారని, దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం దాఖలు చేసిన పిటిషన్‌గా గుర్తించాలని కోరారు. దక్షిణాసియాలోనే అతిపెద్ద టర్మినల్‌ను నిర్మించాలనే ప్రతిపాదనతో భూసేకరణ చేశారని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ ప్రతిపాదన రద్దయిందని తెలిపారు.
భూసేకర ణ జరిగినపుడు ఆ భూమి శివార్లలో ఉన్నదని, ప్రస్తుతం చుట్టూ నివాస సముదాయాలతో అభివృద్ధి చెందిందని వివరించారు. ఈ భూమిని విక్రయించడం ద్వారా వచ్చే సొమ్మును ప్రజాప్రయోజనాలకే వెచ్చిస్తారని తెలిపారు. గతంలో ట్రక్ యజమానుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను ఇదే హైకోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. పారింగ్ అవసరాలకు పటాన్చెరు, బాటసింగారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని మంగళంపల్లి ప్రాంతాలు ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయని తెలిపారు. అందువల్ల ఈ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

