అమ్మకానికి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఆస్తులు
ప్రభుత్వరంగ ఆస్తులను ఒక్కొక్కటిగా విక్రయిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ కన్ను తాజాగా టెలికాం సంస్థలపై పడింది. ఇప్పటికే సంస్థలకు చెందిన పలు ఆస్తులను అమ్మకానికి పెట్టిన కేంద్ర సర్కార్..తాజాగా పలు నగరాల్లో ఉన్న భవంతులు, భూములు, ఆస్తులను విక్రయించేయోచనలో ఉన్నది.
న్యూఢిల్లీ, నవంబర్ 26: ప్రభుత్వరంగ ఆస్తులను ఒక్కొక్కటిగా విక్రయిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ కన్ను తాజాగా టెలికాం సంస్థలపై పడింది. ఇప్పటికే సంస్థలకు చెందిన పలు ఆస్తులను అమ్మకానికి పెట్టిన కేంద్ర సర్కార్..తాజాగా పలు నగరాల్లో ఉన్న భవంతులు, భూములు, ఆస్తులను విక్రయించేయోచనలో ఉన్నది. దీంట్లోభాగంగా బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లకు చెందిన భూములు, ఇతర ఆస్తుల విలువను నగదుగా మార్చే ప్రక్రియలో భాగంగారూ.1,300 కోట్ల విలువైన తాజా ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే నగదీకరణ ద్వారా రూ.9 వేల కోట్లకు పైగా నిధులను సమీకరించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తుల విక్రయ ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు, ఎన్ఎల్ఎమ్సీ తన సొంత ఆస్తుల పోర్ట్‌ఫోలియోను కూడా మార్కెట్లోకి తీసుకువెళ్తున్నది. దీంట్లోభాగంగా ఈ రెండు సంస్థలకు చెందిన న్యూఢిల్లీ, ముంబై, ప్రయాగ్‌రాజ్, చెన్నైలలో ఉన్న ఆస్తులపై దృష్టి సారించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

