బీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం
బీఆర్ఎస్ నేతలపై అధికార పార్టీ నేతల దాడుల పరంపర కొనసాగుతున్న ది. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం లో బీఆర్ఎస్ నాయకుడిపై దాడికి తెగబడ్డారు.
- కండ్లలో కారంకొట్టి ఆయుధాలతో అధికార పార్టీ నాయకుల ఘాతుకం
- మార్నింగ్ వాక్ చేస్తుండగా దాడి
- నాగర్‌కర్నూల్ జిల్లా తీగలపల్లిలో ఘటన
- తీవ్రంగా గాయపడిన భాస్కర్‌రెడ్డి
- పరామర్శించిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి
కోడేరు, నవంబర్ 26 : బీఆర్ఎస్ నేతలపై అధికార పార్టీ నేతల దాడుల పరంపర కొనసాగుతున్న ది. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం లో బీఆర్ఎస్ నాయకుడిపై దాడికి తెగబడ్డారు. గురువారం ఉదయం 5:45 గంటలకు తీగలపల్లి బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కన్నారెడ్డి భాస్కర్‌రెడ్డి (54) బావాయిపల్లి గ్రామం వైపు మార్నింగ్‌వాక్‌కు వెళ్లాడు. రాజకీయ కక్షలను దృష్టిలో ఉంచుకొని అ ప్పటికే భాస్కర్‌రెడ్డి కోసం మాటు వేసిన అదే గ్రామానికి చెందిన నలుగురు కాంగ్రెస్ నాయకులు కురువ పెద్ద బిచ్చయ్య, తెలుగు బాల్‌చంద్రయ్య, తెలుగు వీరభద్రయ్య, తెలుగు ఆంజనేయలు వెనుక నుంచి అటాక్ చేశారు. భాస్కర్‌రెడ్డి కండ్లల్లో కారం చల్లి.. క ర్రలు, మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి దిగారు.
దీంతో ఆయన తలతోపాటు శరీర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడే కుప్పకూలాడు. చనిపోయాడనుకొని ఆయన్ను రోడ్డు పక్కన కంపచెట్లల్లో పడేసి పరారయ్యారు. అటుగా వెళ్తున్న బావాయిపల్లివాసులు.. భాస్కర్‌రెడ్డిని గమనించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. స్థానికులు చేరుకొని నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని సిటీన్యూరో హాస్పిటల్లో చేర్పించారు. బాధితుడి బంధువు బీరం రవీందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కురువ పెద్ద బిచ్చయ్య(ఉప సర్పంచ్), తెలుగు బాలచంద్రయ్య, వీరభద్రుడు, ఆంజనేయులుపై కేసు న మోదు చేసినట్టు కోడేరు పోలీసులు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే బీరం పరామర్శ
మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సూచన మేరకు భాస్కర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని సిటీ న్యూరో దవాఖానకు తరలించారు. అనంతరం వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందుతున్న అతడిని బీరంతోపాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని అభిలాష్‌రావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

