యూపీ బీజేపీ ఎమ్మెల్యే ఓం కుమార్ ఎన్నిక రద్దు
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. బిజ్నోర్ జిల్లా నెహతౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓం కుమార్ ఎన్నికను అలహాబాద్ హైకోర్టు గురువారం రద్దుచేసింది.
- నామినేషన్ పత్రాల్లో లోపాలపై అలహాబాద్ హైకోర్టు తీర్పు
అలహాబాద్, నవంబర్ 26: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. బిజ్నోర్ జిల్లా నెహతౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓం కుమార్ ఎన్నికను అలహాబాద్ హైకోర్టు గురువారం రద్దుచేసింది. నామినేషన్ పత్రాల్లో లోపాలున్నాయని తేల్చిన కోర్టు, ఈ ఉత్తర్వుల అమలుపై ఆయనకు 15 రోజులపాటు పరిమిత స్టే ఇచ్చింది.
షెడ్యూల్డ్ కులాలకు రిజర్వు చేసిన ఈ నియోజకవర్గంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్టీయ్ర లోక్‌దళ్ అభ్యర్థి మున్షీరాంపై ఓం కుమార్ 258 ఓట్ల తేడాతో గెలిచారు. మున్షీరాం దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ సలీల్ కుమార్ రాయ్ పాక్షికంగా అనుమతించారు. అయితే, 15 రోజుల వ్యవధిలో ఓం కుమార్ తన నియోజకవర్గ ఓటర్లకు ప్రాతినిధ్యం వహించవచ్చని, ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరిగితే వాటిలో పాల్గొనవచ్చని కోర్టు తెలిపింది. అయితే, ఈ వ్యవధిలో కుమార్ అసెంబ్లీలో లేదా దాని కమిటీల్లో ఓటు వేయడానికి వీలుండదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

