శ్రీవారికి 121 కిలోల పసిడి విరాళం
తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వర్ధమాన్ జైన్ భూరి విరాళం అందజేశారు. ఈ మేరకు గురువారం ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలను టీటీడీ అధికారులకు అందజేశారు.
- ఏపీ సీఎం సమక్షంలో అందజేసిన చెన్నై వ్యాపారవేత్త వర్ధమాన్ జైన్
- నేడు అభిషేకం అనంతరం శ్రీవారికి అలంకరించనున్నట్టు వెల్లడించిన టీటీడీ
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తేతెలంగాణ): తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వర్ధమాన్ జైన్ భూరి విరాళం అందజేశారు. ఈ మేరకు గురువారం ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలను టీటీడీ అధికారులకు అందజేశారు. టీటీడీ అధికారులు, అర్చకులు, బొకసం అధికారుల సూచనల మేర.. శ్రీవారికి శిరస్సు నుంచి పాదాల వరకు అలంకరించేలా కిరీటం, శంఖుచక్రాలు, కటివరద హస్తాలు, వడ్డాణం, పాదుకలు ఇలా దాదాపు 46 రకాల బంగారు ఆభరణాలను దాత జైన్ తయారు చేయించారు. ఈ ఆభరణాల ప్రదర్శన కోసం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో చెకలతో వేదికను రాత్రి సిద్ధం చేశారు. శుక్రవారం అభిషేకం తర్వాత స్వామివారికి ఈ స్వర్ణాభరాలను అలంకరించనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.
తన కంపెనీలో 60% వాటా విక్రయించడంతో రూ.6 వేల కోట్ల ఆదాయం వచ్చాయని, అందులో నుంచి 121 కిలోల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు గతంలోనే ప్రకటించారు. టీ నగర్‌లోని టీటీడీ ఆలయ విస్తరణకు రూ.1.02 కోట్లు, టీటీడీ ట్రస్టులకు రూ.6 కోట్ల విరాళాలు ఇచ్చిన వర్థమాన్ జైన్.. చెన్నైలోని కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీగా సేవలందిస్తున్నారు. టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లను గతంలో విరాళంగా ఇచ్చారు. 2025లో ఎస్వీ భక్తి చానల్‌కు రూ.5 కోట్లు, గోసంరక్షణకు రూ.కోటి అందజేశారు. 2026 మేలో తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సును కూడా విరాళంగా అందజేశారు.
దేశంలోనే సంపన్న పారిశ్రామిక వేత్తగా గుర్తింపు
సుమారు రూ.8,292 కోట్ల నికర ఆస్తులతో దేశంలోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తల జాబితాలో వర్ధమాన్ జైన్ స్థానం సంపాదించుకున్నారు. చెన్నైలోని ప్రతిష్ఠాత్మక లయోలా కాలేజీ నుంచి స్టాటిస్టిక్స్‌లో పట్టభద్రుడైన వర్ధమాన్ జైన్.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఉన్నత విద్యను పూర్తిచేశారు. వ్యాపారవేత్తగానే కాకుండా పలు భారతీయ స్టార్టప్ కంపెనీల్లో ఏంజెల్ ఇన్వెస్టర్‌గా పెట్టుబడులు పెడుతూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారు.

ఏషియా ఇంజినీరింగ్ డైరెక్టర్‌గా, క్విబస్ రిసోర్సెస్ బోర్డు సభ్యుడిగా కార్పొరేట్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు. హెల్త్ కేర్ బీపీవో, ఐటీ, నిర్మాణ రంగాల్లో ఆయన అగ్రగామిగా నిలిచారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హెల్త్‌కేర్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ సంస్థ యాక్సెస్ హెల్త్‌కేర్ సహ వ్యవస్థాపకుడిగా, వైస్ చైర్మన్‌గా ఆయన వేలాది మందికి ఉపాధి కల్పించారు. గతంలో పెరోట్ సిస్టమ్స్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన వర్దమాన్ జైన్.. ఆ సంస్థ డెల్ సర్వీసెస్‌లో విలీనమయ్యే ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

