ప్యాకేజ్డ్ ఆహారంపై హెచ్చరిక లేబుళ్లు తప్పనిసరి
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుళ్లకు సంబంధించి సుప్రీం కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొవ్వులు, ఉప్పు, చక్కెర అధిక స్థాయిలో ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్ ఉత్పత్తులపై హెచ్చరిక లేబుళ్లను తప్పనిసరిగా ఉంచాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)ను జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఆదేశించింది.
- 4 నెలల్లో నిబంధనలు రూపొందించాలి
- ఎఫ్ఎస్ఎస్ఏఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుళ్లకు సంబంధించి సుప్రీం కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొవ్వులు, ఉప్పు, చక్కెర అధిక స్థాయిలో ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్ ఉత్పత్తులపై హెచ్చరిక లేబుళ్లను తప్పనిసరిగా ఉంచాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)ను జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఆదేశించింది.
ప్యాకేజ్డ్ ఆహారాలపై ఈ లేబులింగ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రం, రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించాలని ప్రజా స్వచ్ఛంద ట్రస్టు ‘3ఎస్ అండ్ అవర్ హెల్త్ సొసైటీ’ దాఖలు చేసిన పిటిషన్‌లోని దరఖాస్తుపై కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అలాంటి ఆహార ఉత్పత్తులపై స్పష్టమైన హెచ్చరిక చిహ్నాలు ఉండాలని పేర్కొంది. ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువ మోతాదులో ఉన్నాయని తెలిసేలా ప్యాకెట్ ముందు భాగంలో షడ్బుజి ఆకారంలో ఎరుపురంగు గుర్తులను ముద్రించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి నాలుగు నెలల్లో నిబంధనలు రూపొందించాలని పేర్కొంది.
దీనివల్ల అనారోగ్యకర ఆహార పదార్థాలను ప్రజలు సులభంగా గుర్తిస్తారని ధర్మాసనం తెలిపింది. ఉప్పు, చక్కెర, కొవ్వులు ఈ మూడింటికీ వేర్వేరు చిహ్నాలు ఉండాలని సూచించింది. ఉదాహరణకు అందులో చక్కెర మాత్రమే ఎక్కువగా ఉంటే ఒక హెచ్చరిక చిహ్నం, చక్కెర, ఉప్పు రెండూ ఎక్కువగా ఉంటే రెండు చిహ్నాలు ఉంచాలని పేర్కొంది. ప్యాకేజ్డ్ ఫుడ్ ఉత్పత్తులపై వినియోగదారులకు పూర్తి అవగాహన ఏర్పడుతుందని ‘సుప్రీం’ అభిప్రాయపడింది. ప్యాకెట్ ముందుభాగం పోషకాహార లేబులింగ్ నిబంధనలను నాలుగు నెలల్లో అమల్లోకి తేవాలని ధర్మాసనం ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

