కాంగ్రెస్ పాలన గాడి తప్పింది
రాష్ట్రంలో రేవంత్ పాలన పూర్తిగా గాడి తప్పిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
- ఆంధ్రా పాలకులకు తొత్తులా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి
- మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
మద్దూర్, నవంబర్ 26 : రాష్ట్రంలో రేవంత్ పాలన పూర్తిగా గాడి తప్పిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతగాక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవాచేశారు. నాడు ఆంధ్రా పాలకులతో కొట్లాడి కేసీఆర్ తెలంగాణ సాధిస్తే.. నేడు రేవంత్‌రెడ్డి ఆంధ్రా పాలకులకు తొత్తులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం పదవిని అడ్డుపెట్టుకుని రాష్ట్రం మొత్తం దోచుకుంటున్నావని సొంత పార్టీ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నా వాటిపై సమాధానం చెప్పలేని స్థితితో రేవంత్ ఉన్నారని దుయ్యబట్టారు.
నాడు కేసీఆర్ ఒక్కరే స్వరాష్ట్ర సాధన కోసం గులాబీ జెండా భుజాన వేసుకుని అందరినీ ఏకతాటిపైకి తెచ్చి రాష్ర్టాన్ని సాధిస్తే.. ఆ విషయాన్ని మరిచిన రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఆయన ఆనవాళ్లు లేకుండా చేస్తా అనడం ఆయన తెలివిలేని తనానికి నిదర్శనమని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూల్చివేతలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతిఒక్కరికీ ఇండ్లస్థలాలు ఇవ్వడంతోపాటు నూతనంగా ఇండ్లు నిర్మించేందుకు కృషిచేస్తామని, రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు హామీ ఇచ్చారు. కోస్గిలో ఈ నెల 29న నిర్వహించే దీక్షాదివస్ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

