పంచాయతీలపై టీజీఐఐసీ పెత్తనం
తెలంగాణలో పారిశ్రామిక పారుల నిర్వహణ పేరుతో గ్రామ పంచాయతీలకు ఉన్న కీలక అధికారాలను తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
- పారిశ్రామిక పారుల పరిధిలో పంచాయతీల అధికారాలకు కత్తెర!
- కీలక అధికారాలు టీజీఐఐసీకి బదిలీ
- ఆదాయంలో 65:35, 50:50 నిష్పత్తిలో వాటా.. ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పారిశ్రామిక పారుల నిర్వహణ పేరుతో గ్రామ పంచాయతీలకు ఉన్న కీలక అధికారాలను తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. పారిశ్రామిక పారుల పరిధిలోని నిర్దిష్ట ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలకు ఉండే పలు అధికారాలు, విధులను ఇకపై టీజీఐఐసీ నిర్వహించనున్నది. పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్-140(ఐ) ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
జీవో ప్రకారం.. గ్రామ పంచాయతీలకు పంచాయతీరాజ్ చట్టంలోని ఐదు విభాగాల కింద ఉన్న అధికారాలు, విధులు టీజీఐఐసీకి బదిలీ కానున్నాయి. సెక్షన్- 64 నుంచి 74 వరకు ఉన్న పన్నులు, ఆర్థిక వ్యవహారాల అధికారాలు, సెక్షన్-75 నుంచి 118 వరకు ఉన్న ప్రజాభద్రత, ప్రజాసౌకర్యాలు, ఆరోగ్యానికి సంబంధించిన విధులు ఇందులో ఉన్నాయి.
ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలోని తోగర్పల్లి, అలియాబాద్ గ్రామ పంచాయతీల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. కొత్తగా ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐఏఎల్ఏ) పరిధిలో పరిశ్రమలు ఇంకా లేని ప్రాంతాల్లో ఆదాయాన్ని టీజీఐఐసీకి 65%, సంబంధిత గ్రామ పంచాయతీకి 35% నిష్పత్తిలో పంచుతారు. ఇతర ప్రాంతాల్లో ఆదాయాన్ని ఇరు సంస్థలు 50:50 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

