ప్రభుత్వం జాప్యం.. స్పోర్ట్స్ కోటా టీచర్లకు శాపం
డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా నియామకాల వ్యవహారం పాఠశాల విద్యాశాఖ మెడకు చుట్టుకున్నది. గత రెండేండ్లుగా సర్టిఫికెట్ల రీ-వెరిఫికేషన్ పేరిట సాగుతున్న జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన హైకోర్టు... కోర్టు ధికార కేసులో భాగంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌కు ప్రత్యేక నోటీసులు జారీ చేసింది.
- డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటాపై కోర్టు ధికార కేసు.. నేడు హైకోర్టు ఎదుట హాజరుకానున్న నవీన్ నికోలస్
- రెండేండ్లుగా స్పోర్ట్స్ కోటా ప్రొబేషన్ నిలిపివేత
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా నియామకాల వ్యవహారం పాఠశాల విద్యాశాఖ మెడకు చుట్టుకున్నది. గత రెండేండ్లుగా సర్టిఫికెట్ల రీ-వెరిఫికేషన్ పేరిట సాగుతున్న జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన హైకోర్టు… కోర్టు ధికార కేసులో భాగంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌కు ప్రత్యేక నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నియామకాల నివేదికతో శుక్రవారం స్వయంగా కోర్టు ఎదుట హాజరుకావాలని హైకోర్టు రిజిస్ట్రీ ఆదేశాలు జారీ చేయడంతో విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో భాగంగా 31 జిల్లాల్లో స్పోర్ట్స్ కోటా కింద (రోస్టర్ పాయింట్లు 48,98) 96 పోస్టులను భర్తీ చేశారు. ఆన్లైన్ వెరిఫికేషన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడం, అనర్హులకు ఉద్యోగాలు దకాయన్న ఆరోపణలు రావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు 398 మంది అభ్యర్థుల ధృవపత్రాలను భౌతికంగా పునఃపరిశీలించారు. రెండేండ్ల ప్రొబేషన్ కాలం పూర్తయినప్పటికీ, ఈ వివాదం కొలికి రాకపోవడంతో స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయుల ప్రొబేషన్ డిక్లరేషన్ (సర్వీస్ క్రమబద్ధీకరణ) ప్రక్రియను విద్యాశాఖ ఇటీవల నిలిపివేసింది.
ఉన్నత స్థాయి కమిటీ భేటీకి అధికారుల నిరాసక్తి
రెండో విడత ఫిజికల్ వెరిఫికేషన్ నివేదికకు తుది ఆమోదం తెలిపేందుకు నిర్వహిస్తున్న మూడవ హైలెవెల్ కమిటీ సమావేశానికి ఇతర శాఖల ఉన్నతాధికారులు సహకరించడం లేదని తెలుస్తున్నది. ఇప్పటివరకు జరిగిన సమావేశాలకు గైర్హాజరైన డైరెక్టర్ నవీన్ నికోలస్.. ఇప్పుడు కోర్టు ధికార కేసు తన మెడకే చుట్టుకోవడంతో స్వయంగా మూడవ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదటినుంచీ విద్యాశాఖ ఏకపక్ష వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) అధికారులు ఈ భేటీకి సమయం కేటాయించేందుకు నిరాసక్తి చూపుతున్నారు. డిసెంబర్లో జరిగే ‘ఖేలో ఇండియా’ జాతీయ క్రీడా పోటీల నిర్వహణ పనులను సాకుగా చూపిస్తూ క్రీడాశాఖ అధికారులు సమావేశాలను వాయిదా వేస్తూ వచ్చారు. కోర్టు నోటీసుల నేపథ్యంలో క్రీడాశాఖ చొరవ తీసుకొని 25వ తేదీన భేటీకి సిద్ధమైనప్పటికీ, జీఏడీ అధికారుల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమావేశం తేదీ ఖరారు కాలేదు.
23 రిట్ పిటిషన్లు.. కౌంటర్ దాఖలులో జాప్యం
తమకు అన్యాయం జరిగిందంటూ జాతీయస్థాయి క్రీడాకారులు హైకోర్టులో 23 రిట్ పిటిషన్లతోపాటు కోర్టు ధికార పిటిషన్ దాఖలు చేశారు. రెండేండ్లుగా ప్రతి విచారణ సమయంలోనూ వారం చొప్పున గడువు కోరుతూ కాలయాపన చే సిన విద్యాశాఖ, కనీసం కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తంచేసిన ధర్మాసనం, ఈసారి ఎలాంటి మినహాయింపు ఇవ్వకుండా కోర్టు రిజిస్ట్రీ ద్వారా నేరుగా డైరెక్టర్ నవీన్ నికోలస్‌కు నోటీసులు జారీ చేసింది. డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియ రెండేండ్లుగా సాగుతుండటంతో అనర్హులు ఇప్పటికే ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి చేసుకున్నారని, కానీ, అర్హులైన తమ నియామకాలను మాత్రం విద్యాశాఖ ప్రొబేషన్ ప్రకటించకుండా పకనపెట్టిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు. 398 మంది స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నివేదికకు వీలైనంత త్వరగా ఆమోదం తెలిపి న్యాయం చేయాలని కోరుతూ కే హరికృష్ణ, పీ దశరథ్, పొట్లం వెంకటేశ్ తదితరులు ఈ నెల 19న రాష్ట్ర హోంశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

