పెండ్లి నాటికి చికిపోతున్నా చకనమ్మలు
ఆశ్వయుజ మాసంలో పెండ్లిచూపుల సమయంలో బొద్దుగా ఉన్న అమ్మాయిలు కార్తిక మాసంలో పెండ్లి నాటికి భలే స్లిమ్‌గా మారిపోయారు! పెండ్లి మంటపంలో చూడముచ్చటగా కనిపించాలని నడుము నల్లపూసలా మార్చుకున్నవాళ్లంతా కడుపు మాడ్చుకుని రాత్రికి రాత్రి సన్నబడట్లేదు.
ఆశ్వయుజ మాసంలో పెండ్లిచూపుల సమయంలో బొద్దుగా ఉన్న అమ్మాయిలు కార్తిక మాసంలో పెండ్లి నాటికి భలే స్లిమ్‌గా మారిపోయారు! పెండ్లి మంటపంలో చూడముచ్చటగా కనిపించాలని నడుము నల్లపూసలా మార్చుకున్నవాళ్లంతా కడుపు మాడ్చుకుని రాత్రికి రాత్రి సన్నబడట్లేదు. బొద్దుగా ఉన్నవాళ్లు బక్క పలుచగా మారిపోవాలని ఎక్స్‌ప్రెస్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. డైట్, వర్కవుట్స్‌తో లాంగ్‌టర్మ్‌లో తగ్గించుకోవాల్సిన కొవ్వుని కొద్ది రోజుల్లోనే కరిగించేస్తున్నారు.ఎలా తగ్గుతున్నారో తెలుసుకోవడం కంటే రోజూ ఎంత తగ్గుతున్నారో చెక్ చేసుకోవడంలోనే తరిస్తున్నారు. శరీరంలో వచ్చినమార్పుల్ని గమనించడం మర్చిపోతున్నారు. పెండ్లి తంతులోని ఈ కొత్త పోకడ గురించి తెలుసుకోండి. రేపటి బాధలు తెలుసుకోకుండా ఆ తప్పు చేయకండి. మరొకరిని చేయనివ్వకండి.
‘అందము, ప్రాయము, ఐశ్వర్యము గల సుందరి దొరకుట అరుదు కదా’ అందుకే ఏదో ఒకదానికి రాజీ పడుతున్నారు. అందమున్న అమ్మాయి దొరుకుతుంది. కానీ, ఐశ్వర్యం ఉన్న అమ్మాయి దొరుకుతుందా? ఈనాటి జంక్ ఫుడ్‌తో జనంలో పెరిగిన ఒబెసిటీ ధనికుల్లో కాస్త ఎక్కువే. కాబట్టి, ఐశ్వర్యం ఉన్న ఇళ్లల్లో పుట్టిన అమ్మాయిల వయసు తక్కువే అయినా లావు కాస్త ఎక్కువగా ఉంటున్నారు. వెయిట్ ఎక్కువే అయినా ఆస్తికి వెయిటేజీ ఎక్కువ కదా. కాబట్టి పెండ్లికి ఓకే చెప్పేస్తున్నారు. అయితే.. ‘పెండ్లి నాటికి మీ అమ్మాయి కాస్త తగ్గితే.. మా వాడికి సరిజోడుగా ఉంటుంది’ అని వరుడి తరఫు వాళ్లు అడగడం, ‘అమ్మాయి డైట్ పాటిస్తది. పెండ్లి నాటికి మారిపోతుందిలే’ అని అమ్మాయి తరఫు వాళ్లు హామీ ఇవ్వడం జరిగిపోతున్నాయి. లగ్గం పెట్టుకున్నంత తేలిగ్గా బరువు తగ్గడానికి కూడా డేట్స్ ఫిక్స్ చేస్తున్నారు. ‘డైట్ పాటించడం పెద్దవాళ్లకే సాధ్యం కావట్లేదు. ఇక టేస్ట్‌కి అలవాటుపడ్డ చిన్నవాళ్లు పెద్దల మాటని నిలబెడతారా’ అని చాలామంది సందేహిస్తున్నారు. పెండ్లిచూపుల్లో ఇలా అనుమానించిన వాళ్లు ముహూర్తం వేళకు నల్లపూసలా మారిన అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒకటీ, రెండు నెలల్లోనే ఇంత మార్పుని చూసి ‘కలయా! నిజమా!’ అని ఆశ్చర్యపోతున్నారు.

ఆడపిల్లలపై ఒత్తిడి
పెండ్లి అన్నది నూరేళ్ల పంట. జీవితాన్ని పండించే వివాహ వేడుక ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలని అంతా కోరుకుంటారు. వధూవరులకైతే ఆ కోరిక పదింతలు ఎక్కువే. పెండ్లి నాటి తీపి జ్ఞాపకాలను ఫొటోలు, వీడియోల్లో చూసుకుంటూ మళ్లీ మళ్లీ సంతోషిస్తుంటారు. అందుకే పెండ్లి తాహతుకు తగ్గట్టు చేయడానికి ఇష్టపడతారు. కొందరు తాహతుకు మించి చేయడానికి సాహసిస్తారు. కలవారి బిడ్డకు కాసుల పేరు పెట్టుకోవడం, ఆకాశమంత పందిళ్లు, ఖరీదైన నగలు, వందల వంటకాలతో పసందైన విందులే కాదు ఇప్పుడు తాహతుకు తగ్గ అందం కూడా ఉండాలనే నియమం అమ్మాయిలపై ఒత్తిడి పెంచుతున్నది. పెండ్లిలో ఫొటో జెనిక్‌గా కనిపించాలి. స్లిమ్‌గా ఉండాలి. అబ్బాయి సరసన నిలుచుంటే ముచ్చటైన జంటాల కనిపించేలా లావు తగ్గాలనే ఒత్తిడి బరువు తగ్గే పనికి పురికొల్పుతున్నది. ఫిట్‌గా, స్లిమ్‌గా ఉంటే చూడముచ్చటగానే కాదు ఆరోగ్యంగానూ ఉంటారు. మంచిదే కాబట్టి బరువు తగ్గేందుకు అమ్మాయిలూ ప్రయత్నిస్తున్నారు. కానీ, టాస్క్ పెద్దది. సమయం తక్కువ.
బరువు తగ్గడానికి వ్యాయామాలు, డైట్ పాటించినా ఆశించిన ఫలితం దక్కలేట్లేదని కొంతమంది అమ్మాయిలు డాక్టర్లను సంప్రదిస్తున్నారు. పెండ్లి నాటికి అందంగా తయారుకావాలనుకునే అమ్మాయిలు సాధారణంగా స్కిన్ ట్రీట్మెంట్, హెయిర్ ైస్టెల్ మేకోవర్ కోసం కాస్మొటాలజిస్ట్లు, డెర్మటాలజిస్ట్‌లను కలుస్తుంటారు. ఇలాంటి వారి కోసం కొన్ని క్లినిక్‌లు స్కిన్, హెయిర్ ట్రీట్మెంట్తోపాటు బరువు తగ్గించి, నాజూకుగా మార్చేందుకు ఒకే ప్యాకేజ్ని ఆఫర్ చేస్తున్నాయి. ఆ క్లినిక్‌లు వీళ్లకు చెప్పేదేమిటంటే… ఇంజెక్షన్ల ద్వారా బరువు తగ్గొచ్చని, వీటి ద్వారానే తొందరగా ఒబెసిటీ తగ్గుతుందని. వాళ్లు చెప్పినట్టే జరుగుతున్నది. కాబట్టి పెండ్లికూతుర్లే కాదు ఇన్స్టాగ్రామ్ రీళ్లలో అందంగా కనిపించాలనుకునే అమ్మాయిలూ వీటికి క్యూ కడుతున్నారు. పెండ్లిచూపుల్లో అందంగా కనిపించాలన్నా ఇలాంటి క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు. కొద్దిమంది అబ్బాయిలు కూడా అధిక బరువును తగ్గించుకునేందుకు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు.
పెండ్లికి ముందు
ఈనాటి పెండ్లిళ్లలో ఆకాశమంత పందిళ్లు, భూదేవంత అరుగులే కాదు ముచ్చటగొలిపే మరెన్నో హంగులున్నాయి. లగ్న పత్రికలు అచ్చు కాకముందే ప్రీ వెడ్డింగ్ షూట్‌తో పెండ్లి తంతు మొదలుపెడుతున్నారు. వివాహ క్రతువును పూజారి నడిపినట్టు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లకు క్రియేటివ్ హెడ్ ఉంటాడు. నచ్చిన లొకేషనలో థీమ్‌కి తగ్గ కాస్ట్యూమ్స్‌తో కాబోయే దంపతులు షూటింగ్లో నటించేస్తున్నారు. ఈ వీడియోల కోసం థీమ్‌కు తగ్గట్టుగా డ్రెస్ మార్చుకున్నంత ఈజీగా వెయిట్‌లాస్ అవుతున్నారు. లావు తగ్గడం, కొవ్వు కరిగించాలనే ఆలోచన బాగానే ఉంటుంది. కానీ, ఈ తగ్గించడానికీ ఓ లెక్కుంది. శరీర స్వభావం, తినే ఆహారం, చేసే పని, తల్లిదండ్రులను బట్టి మారతాయి. అందానికి కొలతలున్నాయి. ఆ కొలతల్లోకి మారిపోవడం అందరికీ సాధ్యం కాదు. సాధ్యమయ్యే ప్రయత్నానికీ పరిమితులున్నాయి. ఎంత కాలానికి ఎంత తగ్గుతూ పోవాలో వైద్యులు, డైటీషియన్లు నిర్ణయిస్తారు. వాళ్ల సలహాలతోనే ఆహార సమయాలు, వ్యాయామ సమయం నిర్ణయించుకోవాలి. ఇవన్నీ పట్టించుకోకుండా ఫొటోలు, వీడియోల కోసం శరీరాన్ని వేగంగా మార్చాలనే తాపత్రయంతో కొందరు తొందరపడుతున్నారు.

ఎఫెక్టివ్ ఇంజెక్షన్ సైడ్ ఎఫెక్ట్స్
ఇంజెక్షన్లు, సూచించిన ఆహారం, స్మార్ట్ వర్కవుట్స్‌తో అందమైన రూపానికి మారతారని ప్యాకేజ్ని ఆఫర్ చేసే క్లినిక్‌లు చెబుతున్నాయి. కానీ, ఆ ఇంజెక్షన్లను ఎందుకు తయారు చేశారు? ఎవరి కోసం? అనేది చెప్పరు. అమ్మాయిలూ అడగట్లేదు. నమ్మకంతో సాగే ఈ ప్రయత్నంలో ఆరోగ్యాన్ని ఒడ్డుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే అమ్మాయిలకు బ్రైడల్ ప్యాక్‌లో భాగంగా కొన్ని రకాల ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇవి డయాబెటిస్ ఉన్నవాళ్లకు అద్భుతమైన ఔషధాలు. వైద్యుల పర్యవేక్షణలో పరిమిత మోతాదులో తీసుకోవాల్సిన ఈ ఇంజెక్షన్లను తక్కువ సయమంలో బరువు తగ్గాలనే ఉద్దేశంతో తీసుకుంటున్నారు. ఈ ఔషధాలు అనుకున్న ఫలితాన్ని ఇచ్చినా, అనుకోని నష్టాలెన్నో కలిగిస్తాయట. డయాబెటిస్ రోగుల్లో రక్తంలో ఇన్సులిన్ విడుదల, గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సెమాగ్లుటైడ్, టిర్జపాటైడ్ ఔషధాలు పని చేస్తాయి. శరీరంలోని కొవ్వుని కరిగించడం కోసం వీటిని ఉపయోగించినప్పుడు కొవ్వుపైనే కాకుండా కండరాలపైనా కూడా వీటి ప్రభావం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఈ ప్రభావం వల్ల బరువు తగ్గి, సన్నబడినా ముఖంలో జీవకళ తగ్గిపోతుంది. కండరాలు బలహీనమవుతాయి. సన్నగా ఉన్నా శరీర సౌష్టవం సరిగా ఉండదు. ముఖ్యంగా ముఖంపై కండరాలు బలహీనంగా ఉండి అధిక వయసు ఉన్నవారిలా కనిపిస్తారు. ఇవే కాకుండా కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, నీరసం వంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నెలలపాటు వాడితే పిత్తాశయం (గాల్ బ్లాడర్)లో రాళ్లు ఏర్పడతాయి. పిత్తాశయ వాపు, ప్యాంక్రియాటైటిస్ (క్లోమగ్రంథి వాపు), కిడ్నీ పనితీరు తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఊబకాయం లేనివాళ్లు బరువు తగ్గాలి అనుకుంటే కచ్చితంగా వ్యాయామం, ఆహారనియమాలే పాటించి నిజమైన అందాన్ని రెట్టింపు చేసుకోవాలి. కానీ, తక్కువ కాలంలో సన్నబడాలనే ఆత్రుతలో దీర్ఘకాలిక సమస్యలను కొని తెచ్చుకోరాదు. కోరి కొరివితో గోక్కున్నట్టు అందం కోసం బంగారు భవిష్యత్‌ని ఫణంగా పెట్టొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందం కూడా ముఖ్యమే అనుకుంటే పెండ్లిని ఓ ఆరు నెలలు వెనక్కు జరపండి. మంచి డైటీషియన్ సూచనలతో అనుకున్న అందం తెచ్చుకోవచ్చు. అందమైన పందిరిలో ఆనందంగా పెండ్లి చేసుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

