పాట్నా: ఒక వ్యక్తి తన ప్రియురాలిని కలిశాడు. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసింది. అతడు బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించగా ఆ మహిళ అడ్డుకున్నది. ఈ నేపథ్యంలో ఆమె చేతిని గట్టిగా పట్టుకుని బైక్‌తో ఈడ్చుకెళ్లాడు. (Man drags girlfriend on bike) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని నలంద జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నర్దిగంజ్లో భూ సర్వే అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి, ఒక మహిళ మధ్య ఐదేళ్లుగా ప్రేమ సంబంధం ఉన్నది. ఇటీవల రాజ్‌గిర్‌కు వచ్చిన అతడు ఆమెను కలిశాడు.
కాగా, తనను పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ పట్టుబడ్డింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వివాదం ముదరడంతో బైక్‌పై అక్కడి నుంచి పారిపోయేందుకు అతడు ప్రయత్నించాడు. ఆ మహిళ బైక్‌ను పట్టుకుని అతడిని నిలువరించేందుకు యత్నించింది. అయితే బైక్‌ను ఆపకుండా వేగం పెంచిన ఆ వ్యక్తి తన ప్రియురాలి చేతిని గట్టిగా పట్టుని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దీంతో సహాయం కోసం ఆమె కేకలు వేసింది.
మరోవైపు సుమారు వంద మీటర్ల వరకు ఆ మహిళను ప్రియుడు ఈడ్చుకెళ్లిన తర్వాత ఆ బైక్ అదుపుతప్పింది. దీంతో వారిద్దరూ కిందపడ్డారు. స్థానికులు వెంటనే వారి వద్దకు చేరుకున్నారు. మహిళను బైక్‌తో ఈడ్చుకెళ్లిన ఆ వ్యక్తిని పట్టుకుని కొట్టారు. అయితే వారి దాడి నుంచి తప్పించుకునేందుకు ఆమె తన భార్య అని, ఇంటి విషయమై తమ మధ్య గొడవ జరిగిందని నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు.
కాగా, ఈ సంఘటనపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడైన ఆ ప్రభుత్వ ఉద్యోగిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ మహిళను ప్రియుడు బైక్‌తో ఈడ్చుకెళ్తున్న సంఘటనను ఒకరు మొబైల్లో రికార్డ్ చేయడంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A Man was trying to run away to save himself from his estranged GF in Rajgir town of Nalanda district in Bihar. The girl was threatening the guy to either marry her or face the consequences. Panicked man tried to run from there on his bike and Woman hung to the bike to stop him.… pic.twitter.com/K30GUoZJne
— PRATEEK BAJPAI (@prateekbajpai07) July 27, 2026