ఆహారంలో పురుగులు.. హాస్టల్లో ఉండలేమంటూ అర్ధరాత్రి గురుకులం గోడ దూకి ముగ్గురు విద్యార్థినుల పరార్
ఆహారంలో పురుగులు వస్తున్నాయని.. ఇక్కడ ఉండలేమంటూ ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ నుంచి పారిపోయారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని మందారిపేట శివారులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీవీబీ) నుంచి అర్ధరాత్రి గోడదూకి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది.
ఆహారంలో పురుగులు వస్తున్నాయని.. ఇక్కడ ఉండలేమంటూ ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ నుంచి పారిపోయారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని మందారిపేట శివారులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీవీబీ) నుంచి అర్ధరాత్రి గోడదూకి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది.
శనివారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ ప్రహరీ గోడ దాటి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది, పోలీసులు, తల్లిదండ్రులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం గోవిందాపూర్ వెళ్లే మార్గంలోని చెట్ల పొదల్లో దాక్కున్న విద్యార్థినులను తల్లిదండ్రులు గుర్తించి సురక్షితంగా తీసుకొచ్చారు.
విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. హాస్టల్లో అందించే అల్పాహారంలో పురుగులు వస్తున్నాయని, బాత్రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయని, కొద్దిసేపు ఆలస్యంగా నిద్ర లేస్తే కఠినమైన శిక్షలు విధిస్తున్నారని వాపోయారు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉండలేకనే బయటకు వచ్చామని వారు తెలిపారు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్, సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ముగ్గురు విద్యార్థినులు గోడ దూకి బయటకు వెళ్తుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని నిలదీశారు. హాస్టల్లో ఆహారం, పారిశుద్ధ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

