American Airlines | దుస్తులు విప్పేసి, పరుగులు పెడుతూ కేకలు.. విమానంలో మహిళ వింత ప్రవర్తన..!
American Airlines | అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఓ మహిళ అభ్యంతరకరంగా ప్రవర్తించి తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. బాల్టిమోర్ నుంచి మియామికి వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 160 మంది ప్రయాణికులతో విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఆ మహిళ ఊహించని విధంగా తన దుస్తులను తొలగించుకుంది.
American Airlines : అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines) కు చెందిన విమానంలో ఓ మహిళ అభ్యంతరకరంగా ప్రవర్తించి తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. బాల్టిమోర్ నుంచి మియామికి వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 160 మంది ప్రయాణికులతో విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఆ మహిళ ఊహించని విధంగా తన దుస్తులను తొలగించుకుంది. దిగంబరంగా మారి, బిగ్గరగా కేకలు వేస్తూ అటూఇటూ తిరగడం ప్రారంభించింది.
దాంతో తోటి ప్రయాణికులు దిగ్భ్రాంతికి లోనవ్వడమే కాకుండా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని, బలవంతంగా దుస్తులు ధరింపజేసి ఒకచోట కూర్చోబెట్టారు. ఈ విషయాన్ని వారు పైలట్ల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే విమానాన్ని దారి మళ్లించకుండా గమ్యస్థానమైన మియామికే తీసుకెళ్లాలని సిబ్బంది నిర్ణయించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ మహిళను మియామి పోలీసులకు అప్పగించారు.
ఆమె ఎందుకు అలా అసాధారణంగా ప్రవర్తించిందన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సెప్టెంబర్ 11న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

