Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Child Marriage | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం టెంకంపేట్ గ్రామంలో జరగాల్సిన బాల్యవివాహాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ, బాలల పరిరక్షణ విభాగం అధికారులు అడ్డుకున్నారు.
Child Marriage | రాయపోల్, నవంబర్ 28: సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం టెంకంపేట్ గ్రామంలో జరగాల్సిన బాల్యవివాహాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ, బాలల పరిరక్షణ విభాగం అధికారులు అడ్డుకున్నారు. వివాహం జరగనున్నట్లు సమాచారం అందడంతో గ్రామానికి చేరుకున్న అధికారులు బాల్యవివాహాన్ని నిలిపివేశారు. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి, చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించారు. బాలిక భవిష్యత్తుకు భరోసా కల్పించారు.
బాల్యవివాహ నిరోధక చట్టం–2006 ప్రకారం బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. బాలికకు 18 ఏళ్లు, బాలుడికి 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల పిల్లల చదువు మధ్యలోనే ఆగిపోవడమే కాకుండా ఆరోగ్యం, మానసిక వికాసం దెబ్బతింటాయని, వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు.
ఈ సందర్భంగా బాలల పరిరక్షణ ప్రతినిధి బాయికాడి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రతి బాలబాలికకు నాణ్యమైన విద్య అందించి, తమ ఆశయాలను నెరవేర్చుకునే అవకాశం కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. బాల్యవివాహాల నిర్మూలన ఒక్క అధికారుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ఎక్కడైనా బాల్యవివాహం జరుగుతున్నట్లు తెలిసినా, జరగబోతున్నట్లు సమాచారం అందినా వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

