Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
Myanmar military bombs school | ఒక స్కూల్ ప్రాంగణంలో మతపరమైన కార్యక్రమం జరుగుతుండగా మయన్మార్ సైన్యం బాంబు దాడి చేసింది. మహిళలు, విద్యార్థులతో సహా 30 మంది మరణించారు. పౌరులపై జరిగిన ఈ దాడిని ప్రతిపక్షాలు ఖండించాయి.
నేపిడావ్: ఒక స్కూల్ ప్రాంగణంలో మతపరమైన కార్యక్రమం జరుగుతుండగా మయన్మార్ సైన్యం బాంబు దాడి చేసింది. మహిళలు, విద్యార్థులతో సహా 30 మంది మరణించారు. పౌరులపై జరిగిన ఈ దాడిని ప్రతిపక్షాలు ఖండించాయి. (Myanmar military bombs school) మధ్య మయన్మార్‌లోని తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాగ్వే ప్రాంతంలోని సిన్బౌంగ్వే టౌన్‌షిప్‌లోని పాఠశాల, మఠ ప్రాంగణంపై మయన్మార్ ఆర్మీ వైమానిక దాడికి పాల్పడింది. ఒక పసికందు, మహిళలు పలువురు విద్యార్థులతో సహా 30 మంది మరణించినట్లు తెలుస్తున్నది.
కాగా, నాలుగు బాంబులు, 12 ఫిరంగి గుండ్లు, ఏడు ఆత్మాహుతి డ్రోన్లను ఆర్మీ ప్రయోగించినట్లు ప్రతిపక్ష అధికారులు ఆరోపించారు. మహిళలు, పిల్లలతో సహా 20 మందికి పైగా పౌరులు, తొమ్మిది మంది తిరుగుబాటుదారులు మరణించినట్లు ఎన్‌యూజీ ప్రతినిధి నయ్ ఫోన్ లాట్ తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. వైమానిక దాడి జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఎలాంటి ఘర్షణలు జరుగలేదని స్థానికులు తెలిపారు. తిరుగుబాటుదారులు అప్పుడప్పుడు మాత్రమే ఆ గ్రామం మీదుగా వెళ్తారని వివరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
Idupu Kaayitham | ‘ఇడుపు కాయితం’ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. థియేటర్ నుంచి హ్యాపీగా వెళ్తారు: బన్నీ వాస్
‘నాటి కేసీఆర్ దీక్ష ఫలితమే నేటి తెలంగాణ’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

